Amit Mishra: భార్యతో గొడవ, గృహ హింస కేసు.. కోటి రూపాయలు డిమాండ్..!
Amit Mishra: తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అమిత్ మిశ్రా వివరణ ఇచ్చారు. క్రికెటర్ అమిత్ మిశ్రా భార్య గృహ హింస కేసు నమోదు చేసి పరిహారంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందని వార్తల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో క్రికెటర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ఈ మొత్తం విషయంలో స్పష్టత ఇచ్చాడు. తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని చెబుతూ అమిత్ మిశ్రా నిరాశను వ్యక్తం చేశాడు.
అమిత్ మిశ్రా ఎక్స్(ట్విట్టర్) వేదికగా.."మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలతో చాలా నిరాశ చెందాను. నేను ఎప్పుడూ మీడియాను గౌరవిస్తాను, కానీ వార్తలు కచ్చితమైనవే అయినప్పటికీ ఉపయోగించిన ఫోటో నాది, ఇది పూర్తిగా తప్పు. నాకు ఆపాదించబడని కథనాలకు నా ఫోటోను ఉపయోగించడాన్ని వెంటనే ఆపాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది." అని అమిత్ మిశ్రా హెచ్చరించారు.

అమిత్ మిశ్రా భారత్ తరఫున 22 టెస్టుల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 152 మ్యాచ్‌ల్లో 535 వికెట్లు పడగొట్టాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా విజయవంతం కాలేదు. ఇది కాకుండా అమిత్ మిశ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరు. అమిత్ మిశ్రా 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 హ్యాట్రిక్‌లు ఉన్నాయి. 2008లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున డెక్కన్ ఛార్జర్స్‌పై , 2011లో పంజాబ్ కింగ్స్‌పై డెక్కన్ ఛార్జర్స్ తరఫున, 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున పుణె వారియర్స్‌పై హ్యాట్రిక్ సాధించాడు. అమిత్ మిశ్రా చివరిసారిగా ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications