Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకవైపు 59, మ‌రోవైపు 82 మీటర్లు: భారత్ ఓటమికి బౌండరీ లైన్ కూడా ఓ కారణం

ICC Cricket World Cup 2019 : India vs England : Kohli Surprised With Edgbaston Playing Conditions
Cricket World Cup: Virat Kohli questions crazy short boundary after England loss

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ మైదానంలోని బౌండరీ లైన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌ు కోల్పోయి 337 ప‌రుగులు చేసింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీల‌క‌మైంది. ఎడ్జ్‌బ‌ాస్ట‌న్ పిచ్ ఆకారం స‌రిగాలేదు. మైదానంలో ఒక‌వైపు షార్ట్ బౌండ‌రీ ఉంది" అని అన్నాడు.

13 సిక్స‌ర్లు బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్లు

13 సిక్స‌ర్లు బాదిన ఇంగ్లాండ్ ఓపెనర్లు

ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు జానీ బెయిర్‌స్టో, జేస‌న్ రాయ్‌లు ఇద్ద‌రే 13 సిక్స‌ర్లు బాదడం విశేషం. మైదానంలో ఓ వైపు షార్ట్ బౌండ‌రీ ఉండ‌డాన్ని కోహ్లీ తీవ్రంగా త‌ప్పుప‌ట్టాడు. "ఫ్లాట్ పిచ్‌పై ప‌రుగుల ప్ర‌వాహాం ఉండ‌డం స‌హ‌జ‌మే. కానీ బ‌ర్మింగ్‌హామ్ గ్రౌండ్ నిష్ప‌త్తి(లెన్త్‌) నన్ను అసంతృప్తికి గురి చేసింది" అని కోహ్లీ అన్నాడు.

ఒక‌వైపు బౌండ‌రీ లెన్త్ 59 మీట‌ర్లు

ఒక‌వైపు బౌండ‌రీ లెన్త్ 59 మీట‌ర్లు

"ఒక‌వైపు బౌండ‌రీ లెన్త్ 59 మీట‌ర్లు, మ‌రో వైపు 82 మీట‌ర్లు ఉంటే ఎలా ఆడ‌గ‌ల‌ం. ఒక‌వేళ బ్యాట్స్‌మెన్ రివ‌ర్స్ స్వీప్ చేస్తే 59 మీట‌ర్ల వైపు ఉన్న బౌండ‌రీ మీదుగా సిక్స‌ర్ కొట్ట‌డం ఈజీ అవుతుంద‌ని, అలాంటి బ్యాట్స్‌మెన్‌కు స్పిన్న‌ర్లు బౌలింగ్ చేయ‌డం కూడా క‌ష్ట‌మే" అని కోహ్లీ పేర్కొన్నాడు.

82 మీట‌ర్ల దూరం ఉన్న బౌండ‌రీ

82 మీట‌ర్ల దూరం ఉన్న బౌండ‌రీ

"82 మీట‌ర్ల దూరం ఉన్న బౌండ‌రీ వైపు బౌల‌ర్లు కొంత స్మార్ట్‌గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ, చిన్న బౌండ‌రీ వైపు బ్యాట్స్‌మెన్‌ను క‌ట్ట‌డి చేయ‌లేం. చాహల్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ రివ‌ర్స్ స్వీప్‌లో సిక్స్ కొట్టాడు. ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ 360 ప‌రుగులు చేస్తుంద‌నుకున్నాను, కానీ బౌల‌ర్లు మెరుగ్గానే రాణించార‌ు" అని కోహ్లీ అన్నాడు.

మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తే

మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తే

"ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తే ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఈ మైదానంలో ఆడిన ప్రతి జట్టూ ఏదో ఒక సందర్భంలో ఓడింది. అయితే, ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. అయితే నిజాన్ని మేం అంగీకరించాల్సి ఉంటుంది. అప్పటికీ మేం మంచి క్రికెట్ ఆడామని భావిస్తున్నాను" అని కోహ్లీ అన్నాడు.

డ్రస్సింగ్ రూమ్‌లో ఎలాంటి మార్పు లేదు

డ్రస్సింగ్ రూమ్‌లో ఎలాంటి మార్పు లేదు

"డ్రస్సింగ్ రూమ్ వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. ఈ ఓటమి నుంచి తప్పులు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో తప్పక రాణిస్తాం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 360 పరుగులు చేస్తుందని అనుకున్నాం. అయితే, బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఇందుకు సంతోషంగా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, July 1, 2019, 15:25 [IST]
Other articles published on Jul 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+