Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కఠిన చర్యలు తప్పవు: వన్డే వరల్డ్‌కప్ టికెట్ విక్రయాలపై ఐసీసీ

Cricket World Cup tickets are being sold for more than £12,000 on resale websites

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మే 30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం అమ్మకానికి పెట్టిన టికెట్లన్నీ ఇప్పటి అమ్ముడుపోయాయి. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ కోసం ఐసీసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ టికెట్ అమ్మేవాళ్లపై కఠిన చర్యలు తీసుకొనేందుకు ఐసీసీ సిద్ధమైంది. వన్డే వరల్డ్‌కప్‌కి సంబంధించి ఇష్టమొచ్చినంత రీతిలో టికెట్ ధరలు పెంచి విక్రయించే వారిపై నిఘా పెట్టిన ఐసీసీ టికెట్ అమ్మకాలకు కచ్చితమైన రేటును నిర్ధారించే ప్లాట్‌ఫాంని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

"అక్రమంగా టికెట్లు అమ్మేవాళ్లపై దృష్టిసారించాx. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాx. టికెట్లు అమ్మే థర్డ్ పార్టీ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని అభిమానులను కోరుతున్నాం. అటువంటి వ్యక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేస్తే.. మీకు చాలా నష్టం జరుగుతుంది. అవి నిజమైన టికెట్లు కాకుంటే.. మీకు స్టేడియంలో ప్రవేశం ఉండదు" ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

టికెట్ కొనుగోలు చేసిన అభిమానులు మ్యాచ్‌కు వెళ్లలేక, వాటిని తిరిగి విక్రయించాలనుకుంటే.. దానిని ఐసీసీ ప్లాట్‌ఫాం ద్వారానే చేయాలని ఐసీసీ స్పష్టం చేసింది. ఇందుకోసం టికెట్ మాస్టర్ అనే సంస్థ ఈ ప్లాట్‌ఫాంని రూపొందించిదని ఐసీసీ తెలిపింది. దీనిని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Story first published: Friday, January 18, 2019, 12:22 [IST]
Other articles published on Jan 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+