ప్రపంచ కప్: సెక్స్ టాక్‌తో దిమ్మతిరిగిన మైకేల్ క్లార్క్
సిడ్నీ: ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో భారత్‌పై విజయం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కున్నారు. భారత్‌పై విజయం నేపథ్యంలో ఆయన శృంగార జీవితంపై ప్రశ్నలు వచ్చినట్లు కనిపించడంతో అతను అవాక్కయ్యాడు.
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చవి చూస్తున్న అద్భుతమైన సెక్స్‌పై వ్యాఖ్యానించవలసిందిగా ఓ మీడియా ప్రతినిధి కోరాడు. తాను అడిగిన ప్రశ్నకు తీవ్రంగా ఇబ్బంది పడిన మీడియా ప్రతినిధి వెంటనే తనను తాను సరిచేసుకుంటూ అద్భుతమైన సక్సెస్ అనేది తన ఉద్దేశమని అన్నాడు.

దాంతో తన పక్కనే ఉన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆటగాడు స్టీవ్ స్మిత్ నవ్వుతుండగా, క్లార్క్ తీరు నా గురించి ఎంత బాగా తెలుసు అని అడిగాడు. అది తన భార్యకు సంబంధించిన ప్రశ్న అని అన్నాడు.
భారత్‌పై సెమీ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆదివారంనాడు మరో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. భారత్ విజయాన్ని ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో వినోదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications