Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ ఫైనల్‌: వన్డేల్లో మైఖెల్ క్లార్క్‌ చివరి మ్యాచ్ కానుందా...?

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత క్లార్క్‌ తన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల క్లార్క్ కెరీర్‌లో 244 వన్డేలు ఆడాడు.

పైనల్ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్లార్క్ మాట్లాడుతూ అవును వన్డేల నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని 48 గంటల ముందు తీసుకున్నానని చెప్పాడు. వచ్చే వరల్డ్ కప్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపాడు.

గత కొంతకాలంగా మైఖెల్ క్లార్క్ ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. రికీ పాంటింగ్ తర్వాత ఆస్టేలియా జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన క్లార్క్ సమర్ధవంతంగా జట్టును నడిపాడు. వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో కొనసాగాలాని క్లార్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆస్టేలియా ఆల్ టైమ్ బ్యాట్స్ మెన్లలో మైఖెల్ క్లార్క్ ఒకడు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్స, మర్క్ వాల తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. వన్డేల్లో 8 సెంచరీలు సాధించాడు.

Cricket World Cup: Michael Clarke to retire from one-day cricket after final against New Zealand

ఇదే సమావేశంలో ఓ జర్నిలిస్ట్ పొరపాటుగా అడిగిన ఓ ప్రశ్నకు కొంటెంగా బదులిచ్చి నవ్వులు పూయించాడు. "కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సెక్స్‌ని ఎలా ఆస్వాదిస్తున్నారు?" అని క్లార్క్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత 'సక్సెస్'కు బదులుగా 'సెక్స్' అన్నానని నాలుకు కరచుకున్నాడు.

నవ్వుకున్న క్లార్క్ "ఈ ప్రశ్న నా భార్యను అడగాల్సింది" అంటూ కొంటెగా బదులిచ్చాడు. పక్కనే మరో స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్ నవ్వుని ఆపుకోలేక పోయాడు.

మైఖెల్ క్లార్క్ వన్డేల కెరీర్:

అరంగేట్రం: జనవరి 19, 2003లో అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌పై
వన్డేలు: 244
పరుగులు: 7,907
సరాసరి: 44.42
అత్యధిక స్కోరు: 2007 సెప్టెంబర్ 29న బెంగుళూరులో ఇండియాపై 130
వికెట్లు: 57
క్యాచ్‌లు: 105

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+