భారత్-పాక్ మ్యాచ్‌లో ఉపయోగించిన బంతి వేలంలో ఎంత ధర పలికిందంటే!

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో భాగంగా జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో టీమిండియా ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మరొక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. అయితే, జూన్ 16న మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ టోర్నమెంట్‌గా హైలెట్‌గా నిలిచింది. భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.

ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే
ఈ మ్యాచ్ కోసం అభిమానులు అతృతగా ఎదురు చూస్తారు. అయితే, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ దశలో సైతం ఇరు జట్లు తలపడ్డాయి.

పాక్‌పై టీమిండియా అద్భుత విజయం
ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన వస్తువులను వేలం వేశారు. ఈ మ్యాచ్‌లో ఉపయోగించిన టాస్ కాయిన్, బంతి, అధికారిక స్కోర్ షీట్‌లను ఆన్‌లైన్‌లో వేలం వేయగా వాటిని అత్యధిక ధర చెల్లించి మరీ అభిమానులు సొంతం చేసుకున్నారు.

టాస్ కాయిన్‌కు అత్యధిక ధర చెల్లించి
భారత్-పాక్ మ్యాచ్‌లో ఉపయోగించిన టాస్ కాయిన్‌ని రూ. లక్ష(1450 డాలర్లు)కు కొనుగోలు చేయగా.. మ్యాచ్‌లో వాడిన బంతులను రూ. లక్ష 50 వేలకు(2150 డాలర్లు) అభిమానులు కొనుగోలు చేశారు. ఇక అధికారిక స్కోర్‌షీట్‌ని వేలం వేయగా అవి రూ.75 వేలు(1000 డాలర్ల) అమ్ముడు పోయాయి.

ఇతర మ్యాచుల్లో వాడిన వస్తువులను కూడా వేలంలో
ఇక ఇతర మ్యాచుల్లో వాడిన వస్తువులను వేలం కూడా వేశారు. ఆస్ట్రేలియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉపయోగించిన బంతి 150 డాలర్లకు, దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉపయోగించిన బంతి 300 డాలర్లకు అమ్ముడు పోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications