Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: 'నాకౌట్‌ దశలో ఆ జట్టు చాలా ప్రమాదకరం'

అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన పాకిస్ధాన్ జట్టు ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకొని క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మార్చి 20 (శుక్రవారం) అడిలైడ్‌లో ఆస్టేలియా Vs పాకిస్ధాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్టేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు.

నాకౌట్ దశలో పాకిస్ధాన్ క్రికెట్ జట్టు చాలా ప్రమాదకరమని అన్నాడు. ఆసీస్ జట్టు సహచరులను షేన్ వాట్సన్ ముందుగానే హెచ్చరించాడు. వన్డేల్లో పాకిస్ధాన్ జట్టు చాలా ప్రమాదకరమైనదిగా వాట్సన్ అభివర్ణించాడు. లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌లు పరాజయం పాలైన, ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకొని క్వార్టర్ ఫైనల్‌కు చేరిందని గుర్తు చేశారు.

Cricket World Cup: Australia's Shane Watson wary of Pakistan in quarter-final

' పాకిస్థాన్ క్రికెట్ లో సంచలనాలకు కొదవలేదు. ఆ జట్టు నాకౌట్ స్టేజ్ లో చాలా ప్రమాదకరం . గతంలో కూడా పాకిస్థాన్ నాకౌట్‌లో చాలా బాగా ఆడి చిరస్మరణీయ విజయాలను సాధించింది. అయితే మేము వారికి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మా జట్టు వందశాతం పాకిస్థాన్ పై పోరాటానికి సిద్ధమవుతోంది.. వారిపై గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం' అని షేన్ వాట్సన్ తెలిపాడు.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో షేన్ వాట్సన్ 184 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 2002 నుంచి ఆల్ రౌండర్‌గా 166 వికెట్లు తీసిన వాట్సన్ 5,592 పరుగులు చేశారు. ఇది ఇలా ఉంటే ఆస్టేలియా Vs పాకిస్ధాన్ మ్యాచ్‌లో ఆస్టేలియానే ఫేవరేట్‌గా కనిపిస్తోంది. శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో అస్టేలియా గెలిస్తే, భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జట్లలో విజేతతో తలపడే అవకాశం ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+