దేవుడా! ఇంగ్లాండ్‌పై భారత్ గెలవాలంటూ పాక్ అభిమానులు పూజలు

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం సాధించాలని... ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, ఈ కోరిక భారత అభిమానులది కాదు. పాకిస్థాన్ అభిమానులది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అవును.. ఆదివారం జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయాన్ని సాధించాలని పాక్ అభిమానులు పూజలు కూడా మొదలెట్టేశారు. ఎందుకంటే ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలిస్తేనే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి కాబట్టి. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడబోతోంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లీసేన సెమీస్‌కు చేరడమే కాదు పాకిస్థాన్ సెమీస్ ఆశలను కూడా సజీవంగా ఉంచుతుంది. టోర్నలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లు టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాయి.

ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు
టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలనే తపనతో ఇంగ్లాండ్
సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్‌లు ఎంతో కీలకం
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్‌లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆదివారం జరిగే మ్యాచ్‌లో మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు' అని పాకిస్థాన్ అభిమానులను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌కు పాకిస్థాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు.

పొరుగువారిని చాలా ప్రేమిస్తాం
'మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం కచ్చితంగా భారత్‌కే మద్దతిస్తాం' అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... 'భారత్, పాకిస్తాన్ రెండూ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి" అని మరోక నెటిజన్ ట్వీట్ చేశాడు. 'నేను పాకిస్తానీని, కానీ నేను ఇండియాను సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఎవరెన్ని చేసినా, పాకిస్తాన్ టీమ్ గెలవదని నాకు తెలుసు. భారత జట్టు మాకంటే చాలా ముందుంది" అని మరోక నెటిజన్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications