11వ జట్టుగా వర్షం: మ్యాచ్‌లు రద్దు కావడంలో ఈ వరల్డ్‌కప్‌దే రికార్డు

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే. బ్రిస్టల్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. సోమవారం దక్షిణాఫ్రికా-విండిస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 7.3 ఓవర్ల అనంతరం వర్షం ఆటంకం కలిగించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా.. సోమవారం విండీస్‌తో మ్యాచ్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

నాలుగు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా
నాలుగు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక పాయింటుతో ఖాతా తెరిచింది. తాజాగా, మంగళవారం బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది. వరల్డ్‌కప్ చరిత్రలో మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కావడం ఇదే తొలిసారి.

ఈ వరల్డ్‌కప్‌దే రికార్డు
మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోవడంలో ఈ వరల్డ్‌కప్‌దే రికార్డు. 1992, 2003 ప్రపంచకప్‌లలో రెండేసి మ్యాచ్‌ల్లో వర్షార్పణం కాగా... తాజా వరల్డ్‌కప్‌లో ఆ సంఖ్య ఇప్పటికే మూడుకు చేరింది. అందులో రెండు మ్యాచ్‌ల్లో కనీసం టాస్ కూడా పడలేదు. నిజానికి ఇంగ్లాండ్‌లో ఇప్పుడు సమ్మర్ సీజన్. దీంతో వరల్డ్‌కప్‌కు ఇదే సరైన సమయమని ఐసీసీ భావించి ఈ సమ్మర్‌లో వరల్డ్‌కప్‌ను ప్లాన్ చేసింది.

వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు
అయితే, ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు టోర్నీలో భాగంగా గురువారం జరిగే ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులుగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎడతెరపి లేకుండా వర్షం
ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. బర్మింగ్‌హామ్, పీటర్‌బొరో, న్యూ క్యాజిల్ సహా ఇంగ్లాండ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఐసీసీపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే దగ్గర ప్రపంచకప్ ఎవడు నిర్వహించమన్నాడని మండిపడుతున్నారు.

ప్రపంచకప్‌లో 11వ జట్టుగా వర్షం
"ఈ ప్రపంచకప్‌లో 11వ జట్టుగా వర్షం పాల్గొంది. అది 3 మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో టైటిలే లక్ష్యంగా దూసుకెళ్తుంది. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. నేటి పాక్-ఆసీస్, రేపటి భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ గెలిస్తే వర్షానికి తిరుగేలేదు" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టాస్ గెలిచిన శ్రీలంక స్విమ్మింగ్ ఎంచుకుందని సెటైర్లేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications