Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చండిమాల్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ఇదే

Cricket World Cup 2019: Sri Lanka World Cup Squad announced

మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా 2019 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ముందుగా న్యూజీలాండ్ బోర్డు ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించగా.. ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్ బోర్డులు ఆ తర్వాత ప్రకటించాయి. గురువారం శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

బుధవారమే లంక వెటరన్ పేసర్ లసిత్ మలింగకు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) షాక్ ఇచ్చింది. మలింగ స్థానంలో శ్రీలంక టెస్టు కెప్టెన్‌ దిముత్ కరుణరత్నెను కెప్టెన్‌గా నియమించింది. ఇక రోజు ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇటీవల జట్టుకు దూరమైన లంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ స్థానం దక్కించుకున్నాడు. మరో లంక మాజీ కెప్టెన్ దినేష్ చండీమాల్ చోటు కోల్పోయాడు. కరుణ రత్నేకు జోడిగా యువ ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో, లాహిరు తిరుమన్నేలకు చోటు లభించింది. కుషాల్ పెరీరా వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. దిముత్ కరుణరత్నె, కుషాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వా, ఇసురు ఉదానలు బ్యాటింగ్ భారం మోయనున్నారు.

జీవన్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరీరా, మిలింద సిరివర్ధనేలు ఆల్ రౌండర్లుగా జట్టులో చోటుదక్కించుకున్నారు. సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, మలింగలు పేస్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. లెగ్ స్పిన్నర్ జెఫరీ వండెర్స్ కూడా చోటు దక్కించుకున్నాడు. వీరితో పాటు స్టాండ్ బై ప్లేయర్లను కూడా లంక ప్రకటించింది.

శ్రీలంక జట్టు:
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), ఆవిష్క ఫెర్నాండో, లాహిరు తిరుమన్నే, కుషాల్ పెరీరా (వికెట్ కీపర్), కుషాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వా, జీవన్ మెండిస్, మిలింద సిరివర్ధనే, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరీరా, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, సురంగ లక్మల్, జెఫరీ వండెర్స్, నువాన్ ప్రదీప్.

Story first published: Thursday, April 18, 2019, 18:30 [IST]
Other articles published on Apr 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+