న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా బౌలర్‌ను ఆపి మరీ... ఫీల్డింగ్ సెట్ చూసిన ధోని (వీడియో)

ICC World Cup 2019: MS Dhoni Sets Field For Bangladesh While Batting | Oneindia telugu
Cricket World Cup 2019: MS Dhoni sets field while batting against Bangladesh - Watch

హైదరాబాద్: మ్యాచ్‌ని విజయవంతంగా పూర్తి చేయడం... ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేయాలో వికెట్ల వెనుక నుంచి బౌలర్లకు సలహాలు ఇవ్వడం... మైదానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసే పనులు. అయితే, తాజాగా ప్రత్యర్ధి జట్టు ఫీల్డర్‌కు కూడా ధోని సూచన చేయడం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా మంగళవారం కార్ఢిప్ వేదికగా జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ధోని సెంచరీతో చెలరేగాడు. ధోని ఆడిన తీరు చూస్తే ప్రత్యర్ధి జట్టు బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ సిక్సులు మీద సిక్సులు బాదాడు.

78 బంతుల్లో 113 పరుగులు చేసిన ధోని

ఈ క్రమంలో ధోని 78 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ధోని సిక్స్‌తో సెంచరీని అందుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108(12 ఫోర్లు, 4 సిక్సులు) కూడా సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 359 పరుగులు చేసింది.

బౌలర్‌ను ఆపి మరీ

బౌలర్‌ను ఆపి మరీ

ఇదిలా ఉంటే, భారత జట్టు ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బౌలర్ షబ్బీర్ రెహ్మాన్ 39వ ఓవర్ వేస్తున్న సమయంలో క్రీజులో ఉన్న ధోని బౌలర్‌ను ఆపి మరీ మిడ్ వికెట్‌లో ఉన్న ఫీల్డర్‌ను తీసేయాల్సిందిగా సూచించాడు. ధోని చెప్పిన విధంగానే ఆ బౌలర్ చేయడంతో తిరిగి ఆట ప్రారంభమైంది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ధోని చెప్పిన సూచనను ప్రత్యర్ధి జట్టు బౌలర్ పాటించడంతో కామెంటేటర్లు సైతం అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ పట్ల ధోనికి ఉన్న నిబద్ధతపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

95 పరుగుల తేడాతో భారత్ విజయం

కాగా, ఈ మ్యాచ్‌లో 360 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 95 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు చేజార్చుకోవడం విశేషం.

Story first published: Wednesday, May 29, 2019, 14:41 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X