నిలకడలేని విండిస్ వరల్డ్‌కప్ నెగ్గేనా?: కీలక ఆటగాళ్లు వీరే

హైదరాబాద్: తొలి వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్, నిప్పులు చెరిగే బౌలర్లు ఉన్నప్పటికీ... 1983 వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు చేతిలో ఓడిపోయింది. ఆ జట్టు ఏదో ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. వెస్టిండిస్. 1983 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత 1996లో మాత్రమే టోర్నీ సెమీఫైనల్ వరకు వెళ్లింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
గత కొన్నాళ్లుగా ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. 2015 నుంచి ఇప్పటివరకు 78 వన్డే మ్యాచ్‌లాడిన వెస్టిండీస్ కేవలం 23 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. చిన్నజట్ల చేతిలో సైతం ఓడిపోయింది. ఈ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు గాను వెస్టిండిస్ చివరకు అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.

వరల్డ్‌కప్‌కు ముందు ఫామ్‌లోకి
అయితే, వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగకపోయినప్పటికీ ఆ జట్టుని తేలికగా తీసుకోకూడదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్ కప్ నేపథ్యంలో విండిస్ జట్టుని ఒక్కసారి పరిశీలిద్దాం...

వెస్టిండిస్ బలం
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ని కలిగి ఉంది. బహుశా క్రిస్ గేల్‌కు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు. 87 స్ట్రైక్‌రేట్, 25 సెంచరీలతో 10 వేలకు పైగా పరుగులు చేసిన క్రిస్ గేల్ ఆ జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గేల్‌తో పాటు హెట్‌మయర్, ఎవిన్ లూయిస్, షై హోప్, డారెన్ బ్రావోలతో విండీస్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇక, విండిస్ బౌలర్లు గురించి చెప్పాల్సిన పనిలేదు. జేసన్ హోల్డర్, ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌లు ఇంగ్లాండ్ పిచ్‌లపై నిప్పులు చెరుగుతారు.

వెస్టిండిస్ బలహీనత
నిలకడ లేమి జట్టుకు అతిపెద్ద సమస్య. తమదైన రోజున మాత్రం చెలరేగుతారు. అయితే, ఆరోజు ఎప్పుడు వస్తుందనేది చెప్పలేం. ప్రపంచ వ్యాప్తంగా టీ20లకు అలవాటుపడిన విండిస్ బ్యాట్స్‌మన్ వన్డేల్లో క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోలేకపోతున్నారు. బౌలింగ్‌లో కూడా పస తగ్గింది. కీమర్ రోచ్ ఒక్కడే అనుభవం కలిగిన ఆటగాడు.

వెస్టిండిస్ జట్టులో కీలక ఆటగాళ్లు
క్రిస్ గేల్
ఆండ్రీ రసెల్
షై హోప్
కీమర్ రోచ్

గత చరిత్ర ఇలా
గత పదకొండు వరల్డ్ కప్ సీజన్లలో వెస్టిండిస్ జట్టు రెండు సార్లు వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి రెండు వరల్డ్‌కప్‌లు వెస్టిండిస్‌వే కావడం విశేషం. ఈ రెండు సార్లు క్లైవ్ లాయిడే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించారు. క్లైవ్ లాయిడ్ తర్వాత రెండు వరల్డ్‌కప్‌లు నెగ్గిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ నిలిచాడు. లాయిడ్ తొలి రెండు వరల్డ్‌కప్‌లను (1975, 1979) నెగ్గగా.. పాంటింగ్ 2003, 2007లో వరల్డ్‌కప్ సాధించాడు.

వరల్డ్‌కప్‌లో తలపడే వెస్టిండిస్ జట్టు
జాసన్ హోల్డర్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, ఆష్లే నర్స్, బ్రాత్‌వైట్, క్రిస్ గేల్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయిస్, కీమర్ రోచ్, నికోలస్ పూరన్, ఒషేన్ థామస్, షై హోప్, గాబ్రియెల్, షెల్డన్ కోట్రెల్, హెట్‌మయర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications