టీమిండియా నెట్ ప్రాక్టీస్ రద్దు: భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం ముప్పు

హైదరాబాద్: వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో మొదటి వారం రోజులు జరిగిన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మజాను పంచాయి. అయితే, ఆ తర్వాత నుంచి లండన్‌లో వర్షాలు పడుతుండటంతో అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచులు రద్దైన సంగతి తెలిసిందే. తాజాగా, మంగళవారం బ్రిస్టల్ వేదికగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో అంఫైర్లు టాస్‌ను నిలిపివేశారు. పిచ్ తడవకుండా కప్పిన కవర్లపై వర్షపు నీరు పేరుకుపోయింది.

మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచిన సిబ్బంది
దీంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లను కప్పి ఉంచారు. మరోవైపు టోర్నీలో భాగంగా గురువారం జరిగే ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులుగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎడతెరపి లేకుండా వర్షం
ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని స్థానికులకు హెచ్చరికలు జారీ చేసింది. బర్మింగ్‌హామ్, పీటర్‌బొరో, న్యూ క్యాజిల్ సహా ఇంగ్లాండ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందా?
మ్యాచ్ జరిగే గురువారం మధ్యాహ్నం వరకు కొద్దిపాటి జల్లులు ఉంటాయని పేర్కొంది. దీంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10 లేదా 11 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని నాటింగ్‌హామ్ పోస్ట్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.

మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన న్యూజిలాండ్
టోర్నీలో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు టీమిండియ సైతం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కోహ్లీసేన ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షార్పణం
ఇదిలా ఉంటే, సౌతాంప్టన్ వేదికగా సోమవారం దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. అంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications