Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్ తొలి మ్యాచ్: తొలి స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ చరిత్ర

Cricket World Cup 2019: Imran Tahir Became First Spinner To Bowl The First over Of A World Cup

హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ చరిత్ర సృష్టించాడు. ఈ వరల్డ్‌కప్‌లో మొదటి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ చరిత్ర సృష్టించాడు. గురువారం ప్రారంభమైన 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా తలపడుతోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికా జట్టులో కగిసో రబాడ, లుంగి ఎంగిడి లాంటి స్టార్ పేసర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు బంతినిచ్చాడు.

1
43644

మొదటి ఓవర్ రెండో బంతికి

అయితే, కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండా ఇమ్రాన్ తాహిర్ సైతం మొదటి ఓవర్ రెండో బంతికి ఓపెనర్ బెయిర్ స్టోని పెవిలియన్‌కు చేర్చాడు. తాహిర్ వేసిన బంతి బెయిర్ స్టో బ్యాట్‌ను తాకి నేరుగా వికెట్ కీప‌ర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఓ ఓపెన‌ర్ డ‌కౌట్ కావ‌డం ఇదే మొద‌టిసారి.

గోల్డెన్ డ‌కౌట్ అయిన తొలి ఇంగ్లాండ్ ప్లేయ‌ర్

గోల్డెన్ డ‌కౌట్ అయిన తొలి ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ కూడా బెయిర్‌స్టో కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 41 ఓవ‌ర్ల‌కుగాను 4 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 53 బంతుల్లో 54(8 ఫోర్లు), జో రూట్59 బంతుల్లో 51(5 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 60 బంతుల్లో 57 (4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.

వరల్డ్‌కప్‌లో తొలి బంతి వేసిన బౌలర్లు:

1975: మదన్‌లాల్

1979: ఆండీ రాబర్ట్స్

1983: రిచర్డ్ హ్యాడ్లీ

1987: వినోథన్ జాన్

1992: క్రెయిగ్ మెక్‌డోర్మెట్

1996: డొమినెక్ కార్క్

1999: డారెన్ గాఫ్

2003: షాన్ పొల్లాక్

2007: ఉమర్ గుల్

2011: షఫీఉల్ ఇస్లామ్

2015: నువాన్ కులశేఖర

Story first published: Thursday, May 30, 2019, 18:23 [IST]
Other articles published on May 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+