వరల్డ్‌కప్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన బెస్ట్ రికార్డులివే!

హైదరాబాద్: మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. 1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో గత రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే...

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ రికార్డులు
1979 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదే ఈ స్టేడియంలో ఒక ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు.
2003 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాను ఇంగ్లాండ్ 107 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.
1975 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌పై 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. ఇదే ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు.
ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ ఆటగాడు మార్కస్ ట్రెస్కోటిక్ ఈ స్టేడియంలో 595 పరుగులు చేశాడు. ఇదే ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు.

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో బౌలింగ్ రికార్డులు
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు చెందిన బౌలర్ డారెన్ గావ్(27 వికెట్లు) నిలిచాడు.
5/30 అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెట్టోరి
ఈ స్టేడియంలో 9 సార్లు 5 వికెట్లు ఘనత నమోదైంది. ఇందులో రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాడు బ్రెట్‌లీ ఈ ఘనత సాధించాడు.

ఈ వరల్డ్‌కప్‌లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వబోయే మ్యాచ్‌లు
జూన్ 23 - పాకిస్థాన్ Vs దక్షిణాఫ్రికా
జూన్ 25 - ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా
జూన్ 29 - న్యూజీలాండ్ Vs ఆస్ట్రేలియా
జూలై 5 - పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్
జూలై 14 - వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్

వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్లివే
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, వెస్టిండిస్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications