For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

On This Day, June 17: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ వన్డేగా ఆసీస్‌-సౌతాఫ్రికాల మ్యాచ్

Cricket World Cup 1999 Australia vs South Africa

హైదరాబాద్: 1999లో జరిగిన ఇదే రోజు(జూన్‌ 17) ఆసీస్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ వన్డేగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ సంవత్సరం వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ మ్యాచ్‌లు స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ మరియు నెదర్లాండ్స్‌లలో కూడా జరిగాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేరుకొని ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాతోనే సెమీస్‌ పోరుకు

ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాతోనే సెమీస్‌ పోరుకు

దాంతో ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికాతోనే సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. కానీ, ఈ మ్యాచ్‌తో తొలిసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరే అవకాశాన్ని దక్షిణాఫ్రికా తృటిలో చేజార్చుకుంది. గెలిచే అవకాశం ఉన్నప్పటికీ సఫారీలు మ్యాచ్‌ను టై చేసుకునే తుది పోరుకు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు.

మ్యాచ్‌ చివరి ఓవర్‌ను ఫ్లెమింగ్‌ వేయగా

మ్యాచ్‌ చివరి ఓవర్‌ను ఫ్లెమింగ్‌ వేయగా

ఆ మ్యాచ్‌ చివరి ఓవర్‌ను ఫ్లెమింగ్‌ వేయగా, దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. అయితే సఫారీల చేతిలో వికెట్‌ మాత్రమే ఉంది. దాంతో సఫారీలు ముందుగా కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. కాగా, తొలి మూడు బంతులకు 8 పరుగులు రావడంతో స్కోరు సమం అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా విజయం అంతా ఖాయమనే అనుకున్నారు.

క్రీజ్‌లో ఉన్నది స్టార్‌ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్

క్రీజ్‌లో ఉన్నది స్టార్‌ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్

ఎందుకంటే క్రీజ్‌లో ఉన్నది స్టార్‌ ఆటగాడు లాన్స్‌ క్లూసెనర్ కాబట్టి సఫారీ శిబిరంగా ధీమాగా ఉంది. ‌ ఇక్కడ దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసి రాలేదు. నాల్గో బంతికి క్లూసెనర్ మరియు అలెన్ డొనాల్డ్ మధ్య గందరగోళం నెలకొంది. పరుగు తీసే క్రమంలో తటపటాయించిన డొనాల్డ్ బ్యాట్ విడిచిపెట్టి పిచ్ మధ్యలో నిలబడిపోయి రనౌట్‌గా పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

ఆసీస్‌ ఆనందానికి అవధుల్లేకుండా

ఆసీస్‌ ఆనందానికి అవధుల్లేకుండా

దాంతో మ్యాచ్‌ టై కావడంతో ఆసీస్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్‌ టైగా ముగిసినా ఆసీస్‌ ఫైనల్‌కు చేరడమే వారి జోష్‌కు ప్రధాన కారణం. సమీకరణాల ప్రకారం సూపర్‌-6లో సఫారీలపై విజయం సాధించిన ఆసీస్‌ తుది పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఆసీస్‌ 132 పరుగులకే నిలువరించింది. ఆపై లక్ష్యాన్ని స్టీవ్‌ వా గ్యాంగ్‌ 20.1 ఓవర్లలో రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి ఛేదించి కప్‌ను ముద్దాడింది.

Story first published: Sunday, June 17, 2018, 15:21 [IST]
Other articles published on Jun 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+