క్రికెట్‌లో మనం ఎన్నో ఔట్‌లు చూశాం. బౌలర్ల ప్రతిభతో, బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో వికెట్లు పడటం చూస్తుంటాం. కానీ సెకండ్ లెవన్ టీ20 ఫైనల్స్‌లో ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. దురదృష్టం వెంటాడితే ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకోలేమనే రీతిలో పెవిలియన్‌కు చేరాడు.
మంగళవారం యార్క్‌షైర్ సెకండ్ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో సోమర్సెట్ సెకండ్ లెవన్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ థామస్ అర్ధశతకం సాధించాడు. 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. యార్క్‌షైర్ బౌలర్లలో హిల్ నాలుగు, క్లిఫ్ మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం ఛేదనలో యార్క్‌షైర్ 16.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. వగాడియా (27; 15 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. లియోనార్డ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అయితే సోమర్సెట్, ఇన్నింగ్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రెండు బంతులు ఎదుర్కొని వికెట్ చేజార్చుకున్న లియోనార్డ్ భిన్నమైన రీతిలో పెవిలియన్‌కు చేరాడు.
క్లిఫ్ వేసిన బంతిని లియోనార్డ్ షాట్‌కు యత్నించాడు. అయితే బాల్ నాన్‌స్ట్రైకర్ మీదుకు దూసుకెళ్లింది. తప్పించుకోవడానికి అతను ప్రయత్నించినప్పటికీ బంతి బలంగా తాకి బౌలర్ దిశగా గాల్లోకి లేచింది. ఆ తర్వాత దాన్ని క్లిఫ్ సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో లియోనార్డ్ నిరాశగా మైదానాన్ని వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలో అన్‌లక్కీ వికెట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.