Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలేం జరుగుతోంది!: క్రికెట్‌లో ‘హీట్‌ రూల్‌’, హిట్ ఫర్ సిక్స్ అంటూ కొత్త నివేదిక

Cricket will be among sports hardest hit by climate change, needs to get ‘heat rules’: report


హైదరాబాద్: క్రికెట్ అనేది ఓ ఆట. ఈ ఆట వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. వాతావరణంలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నప్పటికీ దాని ప్రభావం ఆటపై పడుతుంది. వాతావరణం యొక్క హెచ్చుతగ్గుల తీవ్రతను ఆటగాళ్లు సైతం భరిస్తారు.

ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులకు అనుగుణంగా 'హీట్‌ రూల్‌'ను ప్రవేశపెట్టాలని క్రీడా పరిశోధకులు, పర్యావరణ విద్యావేత్తలు ఓ సంయుక్త అధ్యయన నివేదికలో క్రికెట్‌ పాలకులను కోరారు. ఇటీవలి కాలంలో వాతావరణంలో వేడి విపరీతంగా పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.

'హిట్ ఫర్ సిక్స్' అనే నివేదిక

'హిట్ ఫర్ సిక్స్' అనే నివేదిక

దీనిపై బ్రిటిష్‌ అసోసియేషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ స్పోర్ట్స్‌, మరో రెండు వర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. ఈ అధ్యయనంలో భాగంగా 'హిట్ ఫర్ సిక్స్' అనే నివేదికను రూపొందించాయి. ఇందులో యువ ఆటగాళ్ల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వేడిమిని తట్టుకోవడానికి గాలి ధారాళంగా ప్రవహింపజేసే పరికరాలను తయారు చేయాలని సూచించారు.

ఒక్క క్రికెట్‌కే పరిమితం చేయలేదు

ఒక్క క్రికెట్‌కే పరిమితం చేయలేదు

అయితే, దీనిని ఒక్క క్రికెట్‌కే పరిమితం చేయలేదు. మిగతా ఆటలకు కూడా ఇది మేలుకొలుపు అని లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌కు సంబంధించిన సస్టెయినబులిటీ మేనేజర్‌ రస్సెల్‌ సేమర్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "క్రీడాకారులు ప్రేక్షకులు కాదు. వాళ్లను సమీపించే సంక్షోభాలను నివారించడానికి ముందుగా ప్రతిస్పందించాలి" అని తెలిపారు.

అధిక వేడిమి ఆటగాళ్ల ప్రదర్శనపైనా ప్రభావం

అధిక వేడిమి ఆటగాళ్ల ప్రదర్శనపైనా ప్రభావం

"అధిక వేడిమి ఆటగాళ్ల ప్రదర్శనపైనా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ వేడిమి ద్వారా భాధపడుతున్న ప్రతి క్రీడాకారుడి కోసం, ఈ కఠినమైన పరిస్థితులలో ఇంకా చాలా మంది అభిమానులు పని చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి రోజువారీ జీవితాల గురించి తెలుసుకోవాలి. అందుకే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని తెలిపాడు.

Story first published: Wednesday, September 11, 2019, 12:43 [IST]
Other articles published on Sep 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+