Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క‌రోనా ఎఫెక్ట్‌.. ఇకపై అధికారికంగానే బాల్‌ టాంపరింగ్‌!!

Cricket to consider legalised ball-tampering in wake of coronavirus
ICC May Legalize Ball Tampering

దుబాయ్‌: బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము (స‌లైవా), చెమట ఉపయోగించడం క్రికెట్లో సర్వసాధారణం. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్‌-19) దెబ్బకు ఇకపై ఇలా చేయాలంటే భయపడాల్సిందే. వైరస్ లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక బౌలర్లు, ఫీల్డర్లు బంతిని ఈ తరహాలో పాలిష్‌ చేయాలంటే కష్టమే. దీనిపై నిషేధాజ్ఞలు కూడా విధించొచ్చని భావిస్తున్నారు.

ఉమ్ము, చెమట వాడకుండా నిషేధాజ్ఞలు?:

ఉమ్ము, చెమట వాడకుండా నిషేధాజ్ఞలు?:

బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము, చెమటను వాడకుండా నిషేధాజ్ఞలు జారీ అయితే.. బంతిని స్వింగ్‌కు అనుకూలంగా మార్చడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు పరిష్కారం 'బాల్ ‌టాంపరింగ్'‌ను అధికారికం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. ఉప్పు కాగితం (సాండ్ పేపర్) లాంటి వాటితో బంతి ఆకారం మార్చే ప్రయత్నం చేయడం క్రికెట్లో నిషేధం. ఇలా బంతిని టాంపరింగ్‌ చేయబోయి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ పెను వివాదంలో చిక్కుకున్నారు. నిషేధం కూడా ఎదుర్కొన్నారు. క్రికెట్లో ఈ తరహా టాంపరింగ్‌ వివాదాలు మరెన్నో ఉన్నాయి.

పరిష్కారం ఆలోచిస్తున్నాం:

పరిష్కారం ఆలోచిస్తున్నాం:

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రస్తుతం బంతిని స్వింగ్‌కు అనుకూలంగా మార్చడానికి ఉమ్మును ఉపయోగించడం ప్రమాదం కావడంతో.. అందుకోసం ఉప్పు కాగితం లాంటివి లేదా లాలాజలం ఉపయోగపడే ద్రావణం లాంటివి అనుమతించవచ్చని తెలుస్తోంది. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో ఉపయోగించే తెల్ల బంతితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ.. టెస్టుల్లో మాత్రం దీర్ఘ కాలం ఉమ్ము వాడకుండా బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కష్టం. ఇందుకు పరిష్కారమేంటన్నది ఆలోచిస్తున్నాం' అని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 బాల్ ట్యాంప‌రింగ్‌ చ‌ట్టబ‌ద్ధం:

బాల్ ట్యాంప‌రింగ్‌ చ‌ట్టబ‌ద్ధం:

ఐసీసీ మెడికల్‌ కమిటీ కూడా ఇక నుంచి బంతికి ఉమ్ము పూయడం ఏమాత్రం మంచిది కాదని గురువారం జరిగిన ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో స్పష్టం చేసింది. దీంతో ఉద్దేశ‌పూర్వ‌కంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న ఐసీసీ.. బాల్ ట్యాంప‌రింగ్‌ను చ‌ట్టబ‌ద్ధం చేయాల‌నే ప్ర‌తిపాద‌నను ప‌రిశీలిస్తున్న‌ది. అయితే అంపైర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బంతిని పాలిష్ చేసేందుకు అనుమ‌తిలిచ్చే యోచ‌న‌లో ఉంది.

ప్రత్యేక పదార్ధం:

ప్రత్యేక పదార్ధం:

ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంద సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్‌ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్‌ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. చివరకు ఐసీసీ దేన్ని ఓకే చేస్తుందనేది ఆసక్తికరం.

Story first published: Saturday, April 25, 2020, 11:21 [IST]
Other articles published on Apr 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+