పొలార్డ్ నాకంటే ముందే రిటైర్ అవుతున్నావా.. సర్‌సర్లే అంటూ షాకైన గేల్

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ బుధవారం సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 34ఏళ్ల కీరన్ పొలార్డ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయాన్ని తెలియజేశాడు. అకస్మాత్తుగా పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించడంపై అతని అభిమానులతో పాటు క్రికెట్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగల సత్తా ఉన్న ఈ వెస్టిండీస్ కెప్టెన్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పట్ల పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కీరన్ పొలార్డ్ క్రికెట్ కెరీర్ పట్ల శుభాభినందనలు తెలుపుతూ.. కెరీర్లో అతని సెకండ్ ఇన్నింగ్స్ సజావుగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
పొలార్డ్ నువ్వో ఫైటర్, ఛాలెంజర్
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్... కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. పొలార్డ్ ఒక ఫైటర్, ఛాలెంజర్ అని కొనియాడాడు. అతనికి శుభాభినందనలు తెలుపుతూ పొలార్డ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. కీరన్ పొలార్డ్ ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై జట్టు సభ్యుడు స్టార్ పేసర్ బుమ్రా స్పందిస్తూ.. 'పవర్ హిట్టింగ్ మాస్ట్రో, మంచి టీమ్ మేట్, గొప్ప స్నేహితుడు అయిన పొలార్డ్‌కు శుభాభినందనలు.. నువ్వో లెజెండ్‌వి, భవిష్యత్తులో నీకు అంతా మంచే జరగాలి' అంటూ ట్వీట్ చేశాడు.
నమ్మలేకపోతున్నా పొలార్డ్..
పొలార్డ్ అనూహ్య నిర్ణయం పట్ల అతని వెస్టిండీస్ సహచరుడు క్రిస్ గేల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నా కంటే ముందే పొలార్డ్ రిటైర్ అవుతున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా నీ అంతర్జాతీయ కెరీర్‌కు అభినందనలు. నీతో కలిసి ఆడడం చాలా సంతోషంగా ఉంది. నీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మీ నెక్ట్స్ చాప్టర్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ యూనివర్సల్ బాస్ ట్వీట్ చేశాడు.
పొలార్డ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం : సీడబ్ల్యూఐ
ఇక క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సైతం పొలార్డ్ నిర్ణయం పట్ల స్పందించింది. గత పదిహేనేళ్లుగా వెస్టిండీస్ వన్డే, టీ20 జట్లకు అత్యద్భుతమైన సేవలందించినందుకు కీరన్ పొలార్డ్‌కు సీడబ్ల్యూఐలోని ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ.. ప్రెసిడెంట్ రికీ స్కెరిట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలన్న పొలార్డ్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 2019నుంచి వెస్టిండీస్ జట్టు కెప్టెన్‌గా అతని సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పొలార్డ్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు
2012లో ఐసీసీ టీ20 ఫైనల్స్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో పొలార్డ్ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే గతేడాది శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. పొలార్డ్ 2007 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను 123 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 2,706పరుగులు చేశాడు. అలాగే 55 వికెట్లు తీశాడు. 2008లో పొలార్డ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తం 101 టీ20 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 1,569పరుగులు చేశాడు. 42వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications