Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA T20 League : తొలి ఎడిషన్ ప్రారంభ డేట్ ఖరారు.. మొత్తం ఆరు టీంలు, 33 మ్యాచ్‌లు

Cricket Southafrica Announced The Starting Date of SA T20 League is January 10, 2023

క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న ఎస్ఏ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ తేదీ ఖరారయింది. 2023 జనవరి 10వ తేదీన ఈ లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. మొత్తం ఆరు స్క్వాడ్‌లలో ప్రతి జట్టులో 17మంది ప్లేయర్లు ఉన్నారు. ఒక్కో టీంలో గరిష్ఠంగా ఏడుగురు అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు. ఇకపోతే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ 5,20లక్షల డాలర్లు పెట్టి యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్‌ను కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ త్రిస్టన్ స్టబ్సే. ఇకపోతే వేలం పూర్తయి జట్ల ఆటగాళ్లు కూడా ఖరారయిపోయారు.

ఈ సీజన్ గెలుపు మాదే సూపర్ కింగ్స్ కోచ్

ఈ సీజన్ గెలుపు మాదే సూపర్ కింగ్స్ కోచ్

జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్‌కు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా మరో మాజీ CSK ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్ వ్యవహరించనున్నాడు. 'ఆటగాళ్ల వేలంలోనే జోబర్గ్ సూపర్ కింగ్స్‌ విజయం సాధించిందని, చాలా మంది నాణ్యమైన స్థానిక, అంతర్జాతీయ క్రికెటర్లు తమ జట్టుకు ఎంపికయ్యారని, ఈసారి సీజన్ గెలుపు తమదేనని మోర్కెల్ సైతం పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాలో క్రికెట్ విప్లవం

దక్షిణాఫ్రికాలో క్రికెట్ విప్లవం

దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్, ఎంఐ కేప్ టౌన్ జనరల్ మేనేజర్ రాబిన్ పీటర్సన్ ఈ లీగ్ గురించి మాట్లాడుతూ.. రాబోయే లీగ్ దక్షిణాఫ్రికాలో క్రికెట్ అభివృద్ధికి విస్తారంగా దోహదపడుతుందని అన్నారు. 'SA20 లీగ్ దక్షిణాఫ్రికా క్రికెట్‌పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో క్రికెట్ ఆటను విప్లవాత్మకంగా మార్చబోతోంది. ఈ లీగ్‌ను సరైన పంథాలో గనుక నిర్వహించినట్లయితే.. ఇదొక అద్భుతమైన ఈవెంట్ కానుంది. క్రికెటర్ల నుంచి సైతం భారీ ఉత్సాహం నెలకొంది. దక్షిణాఫ్రికాలో ఎన్నాళ్ల నుంచో అనుకుంటుంది ఇప్పుడు జరగబోతుంది. ఈ లీగ్‌లో క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తే.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు అవకాశాలు దక్కించుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా అవకాశాలు దక్కుతాయి.' అంటూ రాబిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.

సన్ రైజర్స్ జట్టు ఇదే

సన్ రైజర్స్ జట్టు ఇదే

జనవరి 10న జరిగే తొలి మ్యాచ్‌తో సహా మొత్తం 33మ్యాచ్‌లు ఈ ఈవెంట్లో జరగనున్నాయి. లీగ్ దశల్లో అన్ని జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడతాయి. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 2 పొజిషన్లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. సెమీస్ విన్నర్లు ఫైనల్లో తలపడతాయి. ఈ వేలంలో మన హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ప్లేయర్లు వీరే. 1.ఐడెన్ మార్క్‌రామ్, 2.ఒట్నీల్ బార్ట్‌మాన్, 3.మార్కో జాన్సెన్, 4.ట్రిస్టన్ స్టబ్స్, 5.సిసాండా మగాలా, 6.జునైద్ దావూద్, 7.మాసన్ క్రేన్, 8.జోన్-జోన్ స్మట్స్, 9.జోర్డాన్ కాక్స్, 10.ఆడమ్ రోసింగ్‌టన్, 11.రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, 12.మార్క్వెస్ అకెర్‌మాన్, 13.జేమ్స్ ఫుల్లర్, 14.సరెల్యా కార్వీ, 15.ఎర్యడన్ కార్వీ గ్కమనే, 16.టామ్ అబెల్

Story first published: Monday, October 3, 2022, 19:19 [IST]
Other articles published on Oct 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+