బవుమా ఔట్.. టీ20 కెప్టెన్‌గా మిల్లర్, వన్డేలకు కేశవ్ మహరాజ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే సౌతాఫ్రికా టీంలు!

జులై 19 నుండి ప్రారంభమయ్యే మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు సౌతాఫ్రికా వెళ్లనుంది. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీ20, వన్డే, టెస్ట్ జట్లను క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. ఇక సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ టెంబా బావుమా మోచేయి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. ఇటీవల భారత పర్యటనలో మోచేయి గాయానికి గురైన బవుమా పూర్తిగా కోలుకోవడానికి మరో ఎనిమిది వారాల సమయం పడుతుంది.
అతని స్థానంలో సెలక్షన్ కమిటీ టీ20 కెప్టెన్‌గా డేవిడ్ మిల్లర్‌ను ప్రకటించింది. అలాగే కేశవ్ మహారాజ్‌లను వన్డే జట్టు కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది. ఇకపోతే స్పీడ్‌స్టర్ కగిసో రబాడకు వన్డేలకు సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇక గెరాల్డ్ కోయెట్జీ టీ20జట్టుకు తొలిసారిగా ఎంపికయ్యాడు.

టీ20 ఫార్మాట్ మాకు ప్రాధాన్యం
‘కొన్ని నెలల్లో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందువల్ల ప్రస్తుతం టీ20ఫార్మాట్ మాకు అధిక ప్రాధాన్యం. మేము టీ20ల్లో ఉత్తమ జట్టును రూపొందించడానికి ఆసక్తి ఉన్న ఆటగాళ్లకు అవకాశాలను అందించాలని చూస్తున్నాం. అదే టైంలో జట్టులో మరింత స్థిరత్వాన్ని కొనసాగించడానికి చూస్తాం. ప్రపంచకప్ లక్ష్యాన్ని సాధించడంలో మాకు ఈ సిరీస్ సన్నాహక పరంగా చాలా దోహదపడుతుందని భావిస్తున్నాం' అని క్రికెట్ సౌతాఫ్రికా కన్వీనర్ ఆఫ్ సెలెక్టర్స్ విక్టర్ పిట్‌సాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌లో జరగబోయే ప్రపంచకప్ కోసమే..
‘ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సూపర్ లీగ్ పాయింట్ల కోసం ప్రస్తుతం అవసరం లేనప్పటికీ.. భారతదేశంలో 2023లో జరగబోయే ఐసీసీ ప్రపంచ కప్ కోసం సన్నద్ధమయ్యే ప్రక్రియలో జట్టులోని బలాబలాలను అంచనా వేయడానికి వన్డేలు ఆడడం చాలా అవసరంగా భావిస్తున్నాం. వన్డేల్లో జట్టు కాంబినేషన్ల విషయంలో, అలాగే ప్రదర్శనల పరంగా ఓ అంచనా తీసుకురావడానికి అవకాశముంటుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ సమయానికి మా జట్టును ఓ షేపులోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాల్సి ఉంటుంది.' అని విక్టర్ పిట్ సాంగ్ అభిప్రాయపడ్డాడు.


ఇంగ్లాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు:
వన్డే :
కేశవ్ మహరాజ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, జాన్నెమాన్ మలన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, అన్రిచ్ నార్జ్, డుస్సీ విల్సేన్ వాన్‌స్సీ, తబ్రైజ్ షమ్సీ, రస్సీ వాన్‌సి, ఖయా జోండో, కైల్ వెర్రెయిన్ .
టీ20:
డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ , క్వింటన్ డికాక్ , రీజా హెండ్రిక్స్ , హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్ , లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, రిటోరియస్, కగిలేస్ రైస్‌బ్రా, రైస్‌బ్రా టౌసి, స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.
టెస్ట్ :
డీన్ ఎల్గర్ (కెప్టెన్), సారెల్ ఎర్వీ, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్జ్, డువాన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, లూథో సిపమ్లా, రాస్సీ వెర్యెన్నే, కెయ్, ఖయా జోండో, గ్లెంటన్ స్టౌర్మాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications