
హైదరాబాద్: దక్షిణాఫ్రికా టీ20 గ్లోబల్ లీగ్‌ను వాయిదా పడటంతో తీవ్రమైన నష్టం జరిగినట్లు అధికార వర్గం తెలిపింది. ఈ నష్టంతో ఓ పాఠం నేర్చుకున్నామని ప్రస్తుత ప్రెసిడెంట్ క్రిస్ నెంజనీ పేర్కొన్నారు. ఈ లీగ్‌ను సరిగా నిర్వర్తించలేకపోయినందుకు గాను గత ప్రెసిడెంట్ హరూన్ లార్గట్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) తలపెట్టిన గ్లోబల్ టీ20 లీగ్ మైదానంలోకి అడుగు పెట్టక ముందే ఆ బోర్డుకు రూ.90 కోట్ల నష్టం తెచ్చి పెట్టింది. సీఎస్‌ఏ ఈ లీగ్ తొలి సీజన్‌ను అక్టోబర్లో నిర్వహించాలనుకుంది. ఏ టెలివిజన్ కానీ, టైటిల్ పెట్టుబడిదారుడు గానీ లేకపోవడమే ప్రధాన కారణం.
అయితే లీగ్ నిర్వహిస్తే రూ.160 కోట్ల దాకా నష్టం భరించాల్సి వస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో ఈ ఏడాదికి లీగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోకముందే ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకుని పూర్తి చెల్లింపులు చేసేసింది.
లీగ్ సన్నాహాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. ఇదంతా కలిపి సీఎస్‌ఏకు భారీ నష్టం తప్పలేదు. ఇక చేసేది లేక లీగ్‌ను వచ్చే ఏడాది నిర్ధిష్టమైన ప్రణాళికతో మొదలుపెడతామని ప్రెసిడెంట్ క్రిస్ నెంజీనీ పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.