For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పూజారా రికార్డును అశ్విన్‌కు ఇచ్చేసింది

Cricket South Africa Posts Ashwin's Photo In Tweet Regarding Pujara, Fans Have a Field Day

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన భారత్ దక్షిణాఫ్రికాల మూడో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ బుధవారం వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగింది. మ్యాచ్ గెలిచేందుకు భారత్ ఎంత కష్టపడినా 187 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్‌ తొలి రోజు సఫారి ఆటగాళ్లు పై చేయి సాధించారు.

కానీ ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియా విభాగం మాత్రం పెద్ద తప్పు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో నయావాల్ పూజారా క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల సహనానికి పరీక్షగా మారి అర్ధ సెంచరీ సాధించాడు.

ఈ తరుణంలో పుజారాను అభినందిస్తూ దక్షిణాఫ్రికా బోర్డు చేసిన ట్వీట్‌ భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఇంతకీ ఏం ట్వీట్‌ చేసారంటే.. 'పుజారా కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా నెమ్మదిగా 173 బంతుల్లో సాధించాడు. తొలి పరుగుకే 50 బంతులాడిన విషయం తెలిసిందే' అంటూ పుజారాకు బదులు అశ్విన్‌ ఫొటోను ట్వీట్‌ చేసింది.

రెండో టెస్ట్‌ సమయంలోనూ భారత కీపర్ పార్థివ్ పటేల్ బదులు సాహా పేరుతో ట్వీట్ చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. సౌతాఫ్రికా చేసిన తాజా తప్పిదంపై భారత క్రికెట్ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ట్వీట్ చేసే ముందు కళ్లజోడు పెట్టుకొని చేయాలని ఒకరంటే.. పుజారాలా మాకు ఓపిక ఉంది. చెత్త బంతులు, చెత్త ఫొటోలు వదలకండి అని ఘాటుగా ఇంకొంకరు కామెంట్‌ చేశారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 25, 2018, 13:10 [IST]
Other articles published on Jan 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+