క్రికెట్‌లో దీర్ఘకాల చర్చ: కెప్టెన్స్ కోపాలకు కోచ్‌లు బలి?
హైదరాబాద్: 'నా కోచింగ్ శైలిపై కోహ్లీకి అభ్యంతరాలున్నాయి. అందుకే నిష్క్రమిస్తున్నా' టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రాజీనామా అనంతరం అనిల్ కుంబ్లే అన్న మాటలివి. గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టే కెప్టెన్ కోహ్లీతో విభేదాల నేపథ్యంలో కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేయడంతో భారత్ క్రికెట్‌లో ఓ చర్చ తెరపైకి వచ్చింది.
అదేంటంటే కోచ్ ముఖ్యమా? లేక కెప్టెన్ ముఖ్యమా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత క్రికెట్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఆటగాళ్లదే రాజ్యం అని చెప్పక తప్పదు. 2007లో గ్రెగ్ ఛాపెల్ కోచ్‌గా ఉన్న టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విభేదాలు తీవ్రస్థాయిలో రచ్చకెక్కాయి.
ఈ నేపథ్యంలో అతడు కోచ్ పదవి నుంచి అర్ధంతరంగా తప్పకున్నాడు. అయితే ఆ తర్వాత కోచ్‌లుగా ఉన్న జాన్ రైట్, గారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగురు. వీరందరూ విదేశీ కోచ్‌లే కానీ ఛాపెల్‌కు చేతకానిది ఆ తర్వాతి వారికి ఎలా సాధ్యమైందనేది ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే అంశం.
అదేంటంటే భారత క్రికెట్‌లో ఓ అనధికారిక రూల్ ఉంది. అదేంటంటే సీనియర్లు, కెప్టెన్ అడుగులకు మడుగులొత్తిన కోచ్‌లే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతారు. అలా కాని పక్షంలో గొడవలు, అనిశ్చితి. వీరి విషయంలో ఏం జరిగిందంటే... గ్యారీ కిర్‌స్టెన్ ఎప్పుడూ తెరవెనుకే ఉండేవాడు. ఇక ఫ్లెచర్ ఆటగాళ్ల టెక్నిక్ వరకే పరిమితమయ్యేవాడు.
డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం పొడించక పోవడంతో ఆ తర్వాత టీమిండియా డైరెక్టర్‌గా పని చేసిన రవిశాస్త్రి ఆటగాళ్లలో ఒకడిగా కలిసిపోయాడు. దీంతో ఆటగాళ్లు రవిశాస్త్రిని ఎంతగానో ప్రేమించారు. గ్రెగ్ ఛాపెల్ తర్వాత తొమ్మిదేళ్లకు మరో లెజెండ్ అనిల్ కుంబ్లే ఎన్నో అంచనాలతో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
అనిల్ కుంబ్లే భారతీయుడు కావడంతో భారత క్రికెట్ సరికొత్త పుంతలు తొక్కుతుందని అందరూ భావించారు. తాము చెప్పినట్టుగా అంతా నడవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆయన చెప్పినట్టుగా చేయలేమంటూ బౌన్సర్లు విసిరారు. తాము చేసేదాన్నే చూస్తూ కిమ్మనకుండా కూర్చోవాలంటూ కండిషన్స్ పెట్టారు.
కుర్రబ్యాచ్ తీరుతో కుంబ్లే కంగుతిన్నాడు. ప్లేయర్లకు కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయంటూ హుందాగా తన కాంట్రాక్ట్ ముగియగానే కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడు. అయితే కుంబ్లేని సాగనంపిన తీరుపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కెప్టెన్‌కు వీటో అధికారమా?
కోచ్ విషయంలో కెప్టెన్, ఆటగాళ్లకు వీటో అధికారాలేంటని సీవోఏకు ఇటీవలే రాజీనామా చేసిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రశ్నించారు. కుంబ్లేకు తన మద్దతుగా తెలియజేస్తూ ఆయన తప్పుకున్నారు. కోచ్ విషయంలో కెప్టెన్‌కు వీటో అధికారాలు ఇవ్వడం చూస్తే భారత క్రికెట్ సరైన దిశలో పయనిస్తుందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. నిజానికి క్రికెట్‌లో భాగంగా మ్యాచ్‌లు ఆడేటప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకప్పటిలా కెప్టెన్‌తో కలసి వ్యూహాలను రచించడం, నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం వరకే కోచ్ పాత్ర పరిమితం కావడం లేదు.

బెంచ్ బలాన్ని కూడా ముందుగానే రెడీ చేసుకోవాలి
బెంచ్ బలాన్ని కూడా ముందుగానే రెడీ చేసుకోవాలి. ప్రధాన కోచ్‌గా కుంబ్లే.. భారత్-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలసి ఇలాగే చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో ధర్మశాల టెస్ట్‌కు కోహ్లీ గాయంతో దూరం కావడంతో.. వైస్ కెప్టెన్ రహానెకు కెప్టెన్సీ అప్పగించడంతో పాటు నిరంతరం మైదానం బయట నుంచి ఆటగాళ్లను పర్యవేక్షించాడు. ఈ టెస్టులో పుజారా స్ట్రయిక్ రేట్ విషయంలో కోహ్లీ మాట్లాడితే అలా మాట్లాడటం మంచిది కాదని కోహ్లీ తప్పుని ఎత్తి చూపాడు. నిజానికి కోచ్ అంటే ప్రస్తుతంతో పాటు జట్టు భవిష్యత్ అవసరాలను కూడా ఊహించగలగాలి.

కోచ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలంటే బెక్‌హామ్ ఘటనే నిదర్శనం
అంతేకానీ కెప్టెన్ డిమాండ్లను కాదు. కోచ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలనేది.. 2003 మాంచెస్టర్ యునైటెడ్ టీమ్ నుంచి స్టార్ ప్లేయర్ బెక్‌హామ్‌ను అలెక్స్ ఫెర్గ్యూసన్ బయటకు నెట్టడమే ఉదాహరణగా ఇప్పటికీ పుట్బాల్ అభిమానులు చెప్తుంటారు. అయితే భారత క్రికెట్‌లో మాత్రం ఓ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. ఇక్కడ కోచ్ కంటే కెప్టెన్‌కే అధికారాలు ఎక్కువ. తాజాగా కుంబ్లే రాజీనామాతో అదే విషయం స్పష్టమైంది. ఈ ఇద్దరి మధ్య గత ఆరు నెలలుగా మాటలు లేవని తెలిసి బీసీసీఐ కూడా షాక్‌కు గురైంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.

చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన కుంబ్లే రాజీనామా
దీంతో చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక్కడ బాధాకరం ఏంటంటే ‘కలసి పని చేసే అవకాశం లేనప్పుడు తప్పుకోవడమే మంచిద'ని కుంబ్లే ట్వీట్ చేయడం. ఓ క్రికెట్ లెజెండ్‌గా తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను నమోదు చేసిన అనిల్ కుంబ్లే కోచింగ్ శైలిని కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించడం ఎంతో మంది మాజీ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నది ఏడాది కాలమే అయినప్పటికీ, ఆ పదవికే కుంబ్లే వన్నె తెచ్చాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనతో కోచ్‌గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే.

కోచ్‌గా కుంబ్లే ట్రాక్ రికార్డు ఇదీ
అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్ ఇదే. ఆ తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇలా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడి ఏకంగా 12 టెస్టుల్లో విజయం సాధించింది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. కాగా, ఫైనల్‌కు రెండు రోజుల ముందు కూడా కుంబ్లేపై కోహ్లీ నోరు పారేసుకున్నాడు.

కుంబ్లేని అవమానించిన కోహ్లీ
కోచింగ్ శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నీవు కోచ్‌గా కొనసాగడానికి జట్టు సభ్యులెవరికీ ఇష్టం లేదని అందరి ముందు కుంబ్లేకి చెప్పినట్లు తెలిసింది. దీంతో కుంబ్లే మనస్తాపానికి గురై తన రాజీనామా లేఖను బోర్డుకు పంపాడు. 'అయితే నేను ప్రధాన కోచ్‌గా కొనసాగడంపై, నా కోచింగ్ శైలిపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లు బీసీసీఐ తొలిసారి సోమవారం తెలిపింది. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. కోచ్‌గా నా పరిధిని ఎప్పుడూ దాటలేదు. మా ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నించింది' అని కుంబ్లే ట్విట్టర్‌లో రాయడం నిజంగా బాధాకరం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications