హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) మధ్య తలెత్తిన జీతాల గొడవ తారాస్థాయికి చేరుకుంది. అటు బోర్డు, ఇటు క్రికెటర్లు ఎవ్వరూ పంతం వీడలేదు. ప్రతిపాదిత నూతన ఆదాయ పంపిణీ విధానంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో జరిపిన చర్చలు ఫలించలేదు.
దీంతో దక్షిణాఫ్రికా పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్లు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. జులై 12వ తేదీన ఆస్ట్రేలియా ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రతిపాదిత నూతన ఆదాయ పంపిణీ విధానం గురించి చర్చించేందుకు ఆటగాళ్లకు సీఏ నిర్దేశించిన గడువు జూన్ 30(శనివారం)తో ముగిసింది.

బోర్డుతో ఉన్న ఒప్పందం ముగియంతో ఆస్ట్రేలియాకు చెందిన 230 క్రికెటర్లు నిరుద్యోగులుగా మారారు. వాస్తవానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున బరిలోకి దిగాలంటే ప్రతిపాదిత కొత్త ఒప్పందంపై ఆటగాళ్లు సంతకాలు చేయాల్సి ఉంది. అయితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు.
దాంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. అయితే దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆసీస్ క్రికెటర్లు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న పురుష, మహిళా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారిపోయారు.
క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నప్పటికీ అవి సత్ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దక్షిణాఫ్రికా పర్యటనను బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఏ, ఆస్ట్రేలియా ఏ, భారత్ ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్, నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ సిరీస్ జులై 12 నుంచి జరగాల్సి ఉంది.

అయితే ఇప్పుడు ఈ సిరిస్ జరుగుతుందో లేదో అనుమానంగా మారింది. ఒకవేళ సమస్య ఇలాగే కొనసాగితే మాత్రం ఆగస్టులో బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్.. సెప్టెంబరులో భారత్‌లో వన్డే సిరీస్‌తో పాటు.. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న యాషెస్ సిరీస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత జీతాల ఒప్పందం ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) క్రికెట్ ఆదాయంలో 25 శాతాన్ని క్రికెటర్లకు పంచుతోంది. ఈ విధానానికి మార్పుచేర్పులు చేసి వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరుగా జీతభత్యాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. ఆదాయ మిగులులో కొంతభాగాన్ని సీనియర్, జూనియర్ క్రికెటర్లకు పంచి.. పురుష, మహిళా క్రికెటర్ల జీతాలను పెంచాలన్నది సీఏ ఆలోచన. దీనికి ఆటగాళ్ల సంఘం నో చెప్పడంతో వివాదం మొదలైంది.