హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా భార్య, భర్తల సంబంధాలపై ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్న నేపథ్యంలో భర్తకు, స్పిల్ట్ ఏసీకి పోలిక పెట్టి తనదైన శైలిలో ట్వీట్టర్‌లో పోస్టు పెట్టాడు.
ఇందులో భర్తలను సెహ్వాగ్ ఎయిర్ కండీషన్‌లతో పోల్చాడు. ఈ ట్వీట్‌ను ఇప్పటికే 6,800 మంది లైక్ చేశారు. వెయ్యికిపైగా మంది రీట్వీట్ చేశారు. 'భర్త పరిస్థితి స్పిల్ట్ ఏసీలాంటిందే. ఇంటి బయట, లోపల ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. దానిని రిమోట్‌తో కంట్రోల్ చేయొచ్చు' అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ అర్ధం పరోక్షంగా భార్యలు చెప్పినట్లే భర్తలు నడుచుకోవాల్సి ఉంటుందని చమత్కరించాడు. ఈ ట్వీట్‌తో పాటు తన భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా కొనసాగుతున్నాడు.