
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ పై విజయం సాధించిన టీమిండియాపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టుపై ప్రశంసలు కురించాడు. థ్రిలింగ్ మ్యాచ్ లో ఇండియా గెలవడం గొప్ప విషయమన్నాడు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా భాగస్వామ్యం మ్యాచ్ కు కీలంగా మారిందన్నారు. ఇదే మ్యాచ్ ను మార్చిందన్నారు. సురేష్ రైనా కూడా టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గొప్పగా ఆడాడని చెప్పాడు.
మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.