Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రామాలాగా తయారైంది: క్రికెట్‌పై ప్లెమింగ్ సంచలనం

క్రిస్ట్ చర్చ్: ఇటీవల కాలంలో క్రికెట్‌ విపరీతంగా ఆడుతుండటాన్ని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ తప్పుబట్టాడు. అలా క్రికెట్‌ను విపరీతంగా ఆడటం వల్ల ఎంటరైట్మెంట్ విలువలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

ముఖ్యంగా టీ20 లీగ్‌లపై స్టీఫెన్ ప్లెమింగ్ మండిపడ్డాడు. క్రికెట్ అనే క్రీడ టెలివిజన్‌లో నిరంతరం ప్రసారమయ్యే డ్రామా మాదిరిగా తయారైందని విమర్శించాడు. ఈ తరహా పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదని ఫ్లెమింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

క్రికెట్‌ కేవలం డబ్బుని సృష్టించే ఆటగా చూడకూడదని సూచించాడు. క్రికెట్ అనేది ఒక వినోదాత్మకమైన క్రీడ, అది అదే స్థాయిలో ఉండాలి కానీ లెక్కకు మించి మ్యాచ్‌లు ఆడటం వల్లే క్రికెట్‌లో ఉన్న మజాను అభిమానులు కోల్పోతున్నారని పేర్కొన్నాడు.

Cricket is like soap opera, has to be entertaining: Stephen Fleming

టీ20 లీగ్‌లపై ఫ్లెమింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. టీ20 లీగ్‌ల ద్వారా క్రికెటర్లకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో అందులో ఆడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు కానీ, తాము ఈ గేమ్ ఆడబోమని చెప్పడం లేదన్నాడు. ఇలా క్రికెట్‌లో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

ప్రస్తుతానికి దీనికి సరైన పరిష్కారం లేకపోయినా, రాబోవు రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణ తగ్గితేనే క్రికెట్‌ను కాపాడుకోగలమని పేర్కొన్నాడు. 1994 నుంచి 2008 వరకు న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఫ్లేమింగ్ టీమిండియా టెస్టు కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.

కోహ్లీ కెప్టెన్సీ, అతను ఆడే ఆట తీరు రాబోయే తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపాడు. అద్భుతమైన ఫిట్ నెస్‌ను కలిగి ఉన్న కోహ్లీ మైదానంలో చూపించే దూకుడు స్వభావం అందరికి తప్పక నచ్చుతుందని తెలిపాడు. భారతీయ యువతకు కోహ్లీ ఓ రోల్ మోడల్‌గా ఉన్నాడని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+