
హైదరాబాద్: తాడిని తన్నే వాడుంటే వాడి తలను దన్నేవాడంటాడని మోసాలకు మోసాలే సమాధానాలు. బెట్టింగ్ రాయుళ్లకు అదుపేమి ఉండదు. అది ఇదీ అని లేకుండా అన్నింటిని మీదా బెట్టింగ్ బాగోతమే ఇంతటి భారీ ఎత్తుగడకు మూలకారణం. నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్, భారత్ జట్టు మధ్య జరుగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన అదిల్ సిక్దర్ అనే వ్యక్తి భారత జట్టు ఓడిపోతోందని అందరూ బలంగా అంచానా వేశారు.
ఈ నేపథ్యంలోనే అదిల్ సిక్దర్ కూడా .. భారత్‌పై ఫైనల్‌లో బంగ్లాదేశ్ గెలుస్తుందని 1,50,000 టాకాలు (సుమారు 1,16,000 రూపాయలు) బెట్టింగ్‌కు దిగాడు. కానీ, చివరి బంతిని దినేష్ కార్తీక్ సిక్సర్‌గా కొట్టడం సిక్దర్‌ను నిలువునా ముంచేసింది. అంతకు ముందు శ్రీలంకతో జరిగిన సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయంపై పందెం కాసిన అతను 40,000 టాకాలు (సుమారు 31,000 రూపాయలు) గెలిచాడు. అయినా ఓడిపోయిన మొత్తమే తక్కువగా ఉండటంతో ఓ క్రిమినల్ ప్లాన్ ఆలోచించాడు.
తనను ఎవరో మర్డర్ చేసినట్టు నకిలీ వీడియో తీయించి, దానికి విపరీతంగా ప్రచారం కల్పించాడు. ఇంతా చేసిన అతనిని తన తల్లి తండ్రి చేసిన కంప్లైంట్‌యే పట్టించింది. అసలు జరిగింది ఇలా.. పందెం సొమ్ము చెల్లించకుండా తప్పించుకోవడానికి ఇద్దరు మిత్రులతోపాటు, సినిమాలకు మేకప్‌మన్‌గా పని చేసే మరో వ్యక్తి సాయాన్ని కూడా తీసుకున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సిక్దర్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టి, మెడ కోసినట్టు వీడియోను చిత్రీకరించారు.
దానిని సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారేలా చేశాడు. సొంత తెలివితేటలతో తన సోదరుడికి ఫోన్ చేశాడు. గొంతు మార్చి, 'సిక్దర్ శవం చిట్టగాంగ్‌లో పడి ఉంది' అంటూ సమాచారం అందించాడు. మరోవైపు సిక్దర్ కుటుంబీకులు ఎంత గాలించినా శవం దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ముందుగా మేకప్‌మన్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో విచారణ జరిపేసరికి సిక్దర్ నకిలీ మర్డర్ ప్లాన్‌ను పూసగుచ్చినట్టు వివరించాడు. అసలు సమాచారం రాబట్టిన పోలీసులకు సిక్దర్, అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకోవడానికి విచారణ చేపట్టరా స్థఆనపట్టల