For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ ఫలితాన్ని మార్చిన మార్టిన్ గుప్టిల్ కళ్లు చెదిరే క్యాచ్ (వీడియో)

 Cricket: Guptill catch helps New Zealand sweep ODI series against Sri Lanka

హైదరాబాద్: న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ ఒంటిచేత్తో పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేవేసింది. నెల్సన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో రాస్ టేలర్ (137), హెన్రీ నికోల్స్ (124) సెంచరీలు చేశారు.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 41.4 ఓవర్లలో 249 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో వన్డేలో సెంచరీ నమోదు చేసి, శ్రీలంకను గెలుపు అంచు వరకు తీసుకెళ్లిన తిసారా పెరీరా మూడో వన్డేలో కూడా మెరుపులు మెరిపించాడు. 62 బంతుల్లోనే 80 పరుగులు చేసి మరోసారి ప్రమాదకరంగా కనిపించాడు.

ఈ క్రమంలో పెరీరా ఇచ్చిన క్యాచ్‌ను మార్టిన్ గప్టిల్ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. 244 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న శ్రీలంకను పెరీరా ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, పెరీరా(80) పరుగుల వద్ద ఔటవగానే మరో ఐదు పరుగుల తేడాలో మిగిలిన అన్ని వికెట్లను చేజార్చుకుంది.

దీంతో మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 115 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ అద్భుతమైన క్యాచ్ పట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మార్టిన్ గుప్టిల్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Tuesday, January 8, 2019, 13:40 [IST]
Other articles published on Jan 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+