Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాబేబీలు కాదిక‌..బంగ్లా టైగ‌ర్లు: ష‌కిబ్ బ్యాటింగ్‌కు టీమిండియా సీనియ‌ర్లు ఫిదా!

ICC Cricket World Cup 2019 : Team India Seniors Lauds Shakib’s 124*, Including Harbhajan || Oneindia
Cricket fratnernity lauds Shakib-Al-Hasan’s 124* including Harbhajan

టాంట‌న్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో ఆశ్చ‌ర్యం క‌లిగించే ఫ‌లితం. మొన్న‌టికి మొన్న బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును మ‌ట్టి క‌రిపించిన బంగ్లాదేశ్ టీమ్‌.. మ‌రో సంచ‌ల‌నాత్మ‌క విజ‌యాన్ని అందుకుంది. వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. వెస్టిండీస్ టీమ్‌పై గెల‌వ‌డం వ‌ర‌కు మాత్ర‌మే చూసుకుంటే- ఇది పెద్ద విజ‌యంగా క‌నిపించ‌క‌పోవ‌చ్చు. 322 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆ జ‌ట్టు సునాయాసంగా, అల‌వోక‌గా అందుకోవ‌డం అనిత‌ర సాధ్య‌మ‌నిపించింది. ఓ ఛేజింగ్ టీమ్ పైగా బంగ్లాదేశ్ వంటి వ‌ర్ధ‌మాన జ‌ట్టు 300 ప్ల‌స్ స్కోరును మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించ‌డం అరుదైన‌, అద్భుత విజ‌యం కిందికే లెక్కేసుకోవ‌చ్చు.

వెస్టిండీస్‌కు కొత్తేమీ కాదు..

వెస్టిండీస్‌కు కొత్తేమీ కాదు..

విండీస్ జ‌ట్టుకు ఎలాంటి ఘ‌న చ‌రిత్ర ఉందో మ‌న‌కు తెలుసు. అదే క్ర‌మంలో- అంతే చెత్త రికార్డుల‌ను కూడా ఆ జ‌ట్టు త‌న ఖాతాలో వేసుకున్న సంద‌ర్భాలు ప్ర‌పంచ‌క‌ప్‌లో చాలా ఉన్నాయి. ఇదివ‌ర‌కు రిచీ రిచ‌ర్డ్‌స‌న్ నేతృత్వంలోని విండీస్ జ‌ట్టు.. ప‌సికూన జింబాబ్వే చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ద్వైపాక్షిక సిరీస్‌, ఇత‌ర టోర్నమెంట్ల‌లోనూ వెస్టిండీస్ జ‌ట్టు త‌న కంటే బ‌ల‌హీన జ‌ట్ల చేతుల్లో చావుదెబ్బ‌లు తిన్న మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. టాంట‌న్‌లోని కూప‌ర్స్ అసోసియేష‌న్ గ్రౌండ్స్‌లో సోమ‌వారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు భారీ స్కోరు చేసేలా క‌నిపించింది. ఓ ద‌శ‌లో 350కి పైగా ల‌క్ష్యాన్ని నిర్దేశించేలా క‌నిపించిన క‌రేబియ‌న్ టీమ్‌.. అనూహ్యంగా చ‌తికిల ప‌డింది. క్రిస్ గేల్‌, బ్రేత్‌వైట్‌, హెట్‌మయిర్‌, ర‌స్సెల్‌, హోల్డ‌ర్ వంటి పించ్ హిట్ట‌ర్లు ఉన్న టీమ్ బంగ్లా బౌలింగ్ ప‌రాక్ర‌మం ముందు చిన్న‌పోయింది.

ఒక్క మ్యాచ్‌తో ద‌శ‌

ఒక్క మ్యాచ్‌తో ద‌శ‌

ఒక్క మ్యాచ్‌.. పాకిస్తాన్ జ‌ట్టును అధఃపాతాళానికి తొక్కేస్తే, మ‌రో మ్యాచ్ బంగ్లాదేశీయుల‌ను అంబ‌రానికి చేర్చింది. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భార‌త్‌తో సాగిన మ్యాచ్‌లో దారుణంగా ప‌రాజ‌యం పాలైంది పాకిస్తాన్‌. ఈ ఒక్క మ్యాచ్ ఆ జ‌ట్టు ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బారేలా చేసింది. ఆ వెంట‌నే టాంట‌న్‌లో కొన‌సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అస‌మాన ప్ర‌తిభ‌ను చూపింది. భారీ హిట్ట‌ర్ల‌తో నిండిన వెస్టిండీస్ టీమ్‌ను క‌ట్ట‌డి చేసింది. 322 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అలవోక‌గా అందుకుంది. భార‌త్ నిర్దేశించిన 336 ప‌రుగుల‌ను అందుకోలేక పాకిస్తాన్ చాప చుట్టేయ‌డం..ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య ఉన్న తేడాను స్ప‌ష్టం చేస్తోంది.

ష‌కిబ్‌కు స‌లాం

ష‌కిబ్‌కు స‌లాం

బంగ్లాదేశ్ ఓపెన‌ర్ ష‌కిబ్ అల్ హ‌స‌న్ ఆడిన ఇన్నింగ్ బ‌హుశా అత‌ని కేరీర్‌లో అగ్ర‌స్థానంలో నిలిచిపోవ‌చ్చు. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు ష‌కిబ్‌. ఈ క్ర‌మంలో అత‌ను 6000 ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆరంభం నుంచీ ఏడుకు పైగా ర‌న్‌రేట్‌ను సాధిస్తూ.. జ‌ట్టును విజ‌యప‌థంలో న‌డిపించాడు. అత‌ని బ్యాటింగ్‌, ప‌ట్టుద‌ల‌కు సీనియ‌ర్లు ఫిదా అయ్యారు. వ‌రుస‌గా ట్వీట్లు పెడుతూ ప్రశంస‌లు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో ట‌ర్బొనేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా ఉన్నాడు. హ‌ర్భ‌జ‌న్‌తో పాటు టీమిండియా మాజీ క్రికెట‌ర్లు ఆర్పీ సింగ్‌, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ ప‌ఠాన్‌, శ్రీలంక మాజీ ఆట‌గాడు ర‌స్సెల్ ఆర్నాల్డ్‌, ఇంగ్లండ్ మాజీ ఓపెన‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌, న్యూజీలాండ్ మాజీ ప్లేయ‌ర్ డేనీ మోరిస‌న్ వంటి ఆట‌గాళ్లు ష‌కిబ్‌ను అభినందించారు.

1
43666
Story first published: Tuesday, June 18, 2019, 8:11 [IST]
Other articles published on Jun 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+