Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ‌ర‌ల్డ్ క‌ప్ న‌యా హీరోస్‌..!

Cricket fraternity lauds Avishka Fernando, Pooran as their centuries

చెస్ట‌ర్‌లీ స్ట్రీట్‌: ప‌్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ వేదిక‌గా మ‌రో ఇద్ద‌రు తాజా హీరోలు ఆవిర్భ‌వించారు. సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. త‌మ కేరీర్‌లో తొలి సెంచ‌రీని న‌మోదు చేసుకున్నారు. వారే- శ్రీలంక, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లు అవిష్క ఫెర్నాండో, నికొల‌స్ పూర‌న్‌. ఇద్ద‌రూ కొత్త‌వారే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇద్ద‌రూ తొలిసారిగా ఆడుతున్న వారే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- సోమ‌వారం చెస్ట‌ర్‌లీ స్ట్రీట్‌లోని రివ‌ర్‌సైడ్ గ్రౌండ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుత‌పోరు ఆవిష్కృత‌మైంది ఆ ఇద్ద‌రు క్రికెట‌ర్ల వ‌ల్ల‌. రెండు జ‌ట్లూ 300ల‌కు పైగా ప‌రుగుల‌ను స్కోర్‌బోర్డుపై జ‌త చేశాయంటే వారిద్ద‌రి చ‌ల‌వే.

లంక బౌలింగ్‌పై సుడిగాలిలా..

లంక బౌలింగ్‌పై సుడిగాలిలా..

శ్రీలంక నిర్దేశించిన 338 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అందుకోవ‌డానికి వెస్టిండీస్ అసాధార‌ణ పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించింది. విధ్వంస‌కారుడిగా పేరున్న క్రిస్‌గేల్ క్రీజులో లేడు. హార్డ్ హిట్ట‌ర్‌గా పేరున్న హెట్‌మెయిర్ త్వ‌ర‌గానే అవుట‌య్యాడు. హ‌ఠాత్తుగా విరుచుకుని ప‌డే కార్లొస్ బ్రేత్‌వైట్ రెండంకెల స్కోరు కూడా చేయ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఈ ప‌రిస్థితుల్లో ఒకే ఒక్క‌డు శ్రీలంక బౌలింగ్‌కు ఢీ కొట్టాడు. ఎదురొడ్డి నిలిచాడు. ప‌ట్టుద‌ల‌గా ఆడాడు. విండీస్ స‌రికొత్త బ్యాటింగ్ సంచ‌ల‌నం నికొల‌స్ పూర‌న్.. 103 బంతుల్లో 118 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్స‌ర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.

రెండో యంగెస్ట్ క్రికెట‌ర్‌గా..

రెండో యంగెస్ట్ క్రికెట‌ర్‌గా..

టాప్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగిన పూర‌న్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడంటే.. అత‌ను క్రీజులో ఏ స్థాయిలో పాతుకుని పోయాడు అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వెస్టిండీస్ త‌ర‌ఫున అతి చిన్న వ‌య‌స్సులోనే సెంచ‌రీ సాధించిన రెండో క్రికెట‌ర్ నికొల‌స్ పూర‌న్‌. ప్ర‌స్తుతం అత‌ని వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాల 272 రోజులు. చిన్న వ‌య‌స్సులో సెంచ‌రీ సాధించిన వెస్టిండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్‌. 23 సంవ‌త్స‌రాల 164 రోజుల వ‌య‌స్సులో క్రిస్ గేల్ 2003 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో కెన్యాపై సెంచ‌రీ న‌మోదు చేశాడు. పూర‌న్ బ్యాటింగ్‌పై సోష‌ల్ మీడియా ప్ర‌శంస‌లు కురిపిస్తోంది. వెస్టిండీస్ జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికీ.. పోరాటం ఎలా చేయాలో మిగిలిన టీమ్‌ల‌కు ఓ పాఠంగా మిగిలింద‌ని అంటున్నారు.

అవిష్క‌..స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

అవిష్క‌..స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

అంత‌కుముందు- తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 338 ప‌రుగుల భారీ స్కోరు చేశారు. 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 338 ప‌రుగులు సాధించారు. ప్ర‌స్తుత టోర్నమెంట్‌లో లంకేయుల‌కు ఇదే అత్య‌ధిక స్కోరు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు లంకేయులు. ఇప్ప‌టిదాకా- ఎదురైన ఓట‌ముల‌పై ప్రతీకారం తీర్చుకుంటోందా? అనే రేంజ్‌లో వారి ఆటతీరు కొన‌సాగింది. విండీస్ బౌల‌ర్ల‌పై విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌త్యేకించి- గాబ్రియెల్ వారి బ్యాటింగ్‌కు బ‌ల‌య్యాడు. అయిదు ఓవ‌ర్ల‌లో 46 ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. ఈ క్ర‌మంలో వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా బ‌రిలో దిగిన ఫెర్నాండో 103 బంతుల్లో 104 ప‌రుగులు చేశాడు.

మ‌రో సంగ‌క్కార‌

మ‌రో సంగ‌క్కార‌

అత‌ని కేరీర్‌లో ఇదే తొలి సెంచ‌రీ. క్లాసిక‌ల్ షాట్లు అత‌ని బ్యాట్ నుంచి వెలువ‌డ్డాయి. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. టెక్నిక్‌గా ఆడాడు. బౌల‌ర్ చేతి నుంచి వెలువ‌డిన బంతికి బౌండ‌రీ లైన్ చూపించేలా ఆడాడు. అతని ఇన్నింగ్‌లో రెండు సిక్స‌ర్లే న‌మోద‌య్యాయి. తొమ్మిది ఫోర్లు బాదాడు. లంకేయుల‌కు మ‌రో సంగక్కార దొరికాడ‌ని ప్ర‌శంసిస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, ఆర్పీ సింగ్‌, హేమంగ్ బ‌దాని వంటి టీమిండియా మాజీ క్రికెట‌ర్లు సైతం అత‌ని బ్యాటింగ్ శైలిని అభినందిస్తున్నారు. సంగ‌క్కార‌, మ‌హేళ జ‌య‌వ‌ర్ధ‌నెలాగా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చూపించ‌గ‌ల బ్యాట్స్‌మెన్‌గా అత‌నికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంద‌ని చెబుతున్నారు.

Story first published: Tuesday, July 2, 2019, 8:14 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+