For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rail Accident ఒడిశా రైలు ప్రమాదంపై క్రికెటర్ల స్పందన.. ఎవరేమన్నారంటే?

ఒడిశాలో ఘోరమైన రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మందికిపైగా మృత్యువాత పడ్డారని, వందలకొద్దీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దేశం మొత్తం ఇదే విషయంపై చర్చించుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్లు కూడా దీనిపై స్పందించారు. మరణించిన వారికి సంతాపం తెలిపిన వారు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈ రైలు ప్రమాదంపై స్పందించాడు. 'ఒడిశాలో అంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని వీరి కుటుంబాలకు ఆ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఈ దేశం మీ వెంట ఉంది' అని ప్రమాద బాధితులకు ధైర్యం చెప్పాడీ ఢిల్లీ ఎంపీ.

odisha train accident

అలాగే స్టార్ క్రికెటర్, ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా ఈ ప్రమాదం గురించి స్పందించాడు. 'ఒడిశా రైలు ప్రమాదం ఘటన గురించి తెలిసి చాలా బాధపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ గురించే ఆలోచిస్తున్నా. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.

వీవీఎస్ లక్ష్మణ్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. 'ఒడిశాలో జరిగిన ఈ దురదృష్టకర ప్రమాదం గురించి తెలిసి గుండె తరుక్కుపోతోంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. అలాగే తమ కుటుంబ సభ్యులను ఈ ప్రమాదంలో కోల్పోయిన వారికి నా సానుభూతి' అని ట్వీట్ చేశాడు. ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా, వెన్నెముక శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు.

'బాధితులు, వారి కుటుంబాల గురించి తలచుకుంటే బాధేస్తోంది. ఓం శాంతి' అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు. 'ఒడిశాలో షాకింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ రైలు ప్రమాదం బాధితుల కోసం ప్రార్థిస్తున్నా' అని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. వీళ్లే కాదు ఇర్ఫాన్ పఠాన్, వసీం జాఫర్, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు కూడా ఈ ప్రమాదంపై తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Story first published: Saturday, June 3, 2023, 17:07 [IST]
Other articles published on Jun 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+