క్రికెట్ మైదానంలో ప్లేయర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం సహజమే. కొన్ని సందర్భాల్లో అవి మితిమీరి ఆటగాళ్లు కొట్టుకునే తీవ్ర స్థాయికి చేరుకుంటుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్ లో ఓ బౌలర్ ఆగ్రహానికి గురై స్టంప్ తో బ్యాటర్ ను బాదాడు. ఆపై అతడి ముక్కును తీవ్రంగా గాయపరిచాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ, ఎవరి మధ్య చోటు చేసుకుందంటే?
మహారాష్ట్రలోని భివండి తాలూకా, అంజూర్ గ్రామంలో ఈ కొట్టాట జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అంజూర్ గ్రామంలోని మయూర్ షాలిక్, విరాజ్ శ్యామ్ అనే ఇద్దరు క్రికెటర్లు స్థానికంగా ఉండే సిద్ధి వినాయక్ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో విరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా, మయూర్ బౌలింగ్ కు దిగాడు. అయితే మయూర్ స్లోగా బౌలింగ్ చేస్తుండటం వల్ల.. 'ఎందుకు అంత స్లోగా బంతులు సంధిస్తున్నావ్? నీకు బౌలింగ్ చేత కాదా?' అని అసంతృప్తికి గురైన విరాట్ బౌలర్ ను ప్రశ్నించాడు. దీంతో కోపానికి గురైన మయూర్ విరాజ్ పై కొట్లాటకు దిగాడు. అంతటితో ఆగకుండా స్టంప్ తీసుకుని అతడిపై దాడికి దిగాడు. విరాట్ ముక్కుపై కూడా కొట్టాడు. దీంతో అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి.

దీంతో గాయపడిన విరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే అధికారులు మయార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే సిద్ధి వినాయక్ క్రికెట్ గ్రౌండ్ వీరిద్దరి గొడవ.. ఇతర క్రికెటర్ల మధ్య కూడా వాగ్వివాదానికి దారీ తీసినట్లు తెలిసింది.