
మౌంట్ మాంగనాయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. అయితే నాలుగో రోజు ఆటలో బంగ్లాదేశ్ తీసుకున్న ఓ రివ్యు ఆ టీంను నవ్వులపాలు చేసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 37వ ఓవర్‌ను బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. అప్పుడు కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. అహ్మద్ తస్కిన్‌కు యార్కర్ వేశాడు. టేలర్ దాన్ని బ్యాట్ అడ్డు పెట్టి ఆపాడు. అయితే ఆ బంతికి ఎల్బీడబ్ల్యూలో ఔట్ అని బంగ్లాదేశ్ ఆటగాళ్లు అప్పీలు చేయగా అంపైర్ ఇవ్వలేదు. దీంతో మరికాసేపట్లో డీఆర్ఎస్ ముగుస్తుందనగా బంగ్లాదేశ్ కెప్టెన్ మోమినుల్ హక్ రివ్యూకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. థర్డ్ అంపైర్ రివ్యూలో ఆ బంతి బ్యాట్‌కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అసలు ఎక్కడా కూడా ఎల్బీ కాలేదు. దీంతో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న వ్యాఖ్యాతలతోపాటు గ్రౌండ్‌లో ఉన్న పలువురు నవ్వుకున్నారు.
ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన ఫోటోల్, వీడియోలు నెట్టింట వైరల్ మారాయి. భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ట్రోల్ చేశాడు. దీనికి బ్యాట్ బిఫోర్ వికెట్ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఆ రివ్యూతో బంగ్లాదేశ్ మ్యాచ్‌లోని తన మూడు రివ్యూలను కోల్పోయింది. ఇక నెటిజన్లు అయితే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టుపై బంగ్లాదేశ్ పట్టుబిగిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో టేలర్ 37 పరుగులతో ఉన్నాడు. ప్రస్తతం కివీస్ 17 పరుగుల అధిక్యంలో మాత్రమే ఉంది. దీంతో చివరి రోజు కివీస్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి లక్ష్యాన్ని చేధిస్తే న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధిస్తుంది. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు: న్యూజిలాండ్ 328, బంగ్లాదేశ్ 558. కాగా న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ ఆడిన తమ చివరి 9 టెస్టు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. అలాగే న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ రాస్ టేలర్‌కు కెరీర్‌లో ఇదే చివరి సిరీస్. ఈ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు టేలర్ ప్రకటించిన సంగతి తెలిసింతే.