Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానులకు సదావకాశం: వేలం పాటలో వరల్డ్ కప్ వస్తువులు

సిడ్నీ: ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్‌కు సంబంధించి కొన్ని వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు దక్కించుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పిస్తోంది.

ఇందులో భాగంగా టోర్నమెంట్‌కు సంబంధించిన 49 టాస్ నాణేలను, అధికారిక స్కోరు కార్డులను వేలం పాట ద్వారా అందుబాటులో ఉంచుతుంది. 2011 వరల్డ్ కప్‌ సందర్భంలో కూడా ఐసీసీకి చెందిన జ్ఞాపకాలు, సేకరణకు సంబంధించి అధికారిక లెసైన్స్ ఉన్న ఎస్‌ఈ ప్రోడక్ట్స్ సంస్ధ ఇలాంటి ప్రయత్నం చేసి విజయవంతమైన విషయం తెలిసిందే.

49 మ్యాచ్‌లకు సంబంధించిన నాణెలపై ఆయా మ్యాచ్‌‌లకు సంబంధించి తేదీలు ఉంటాయి. అఫీసియల్ స్కోరు కార్డును కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు దక్కించుకునే వెసులుబాటుని ఐసీసీ అందిస్తుంది.

నాణెలతో పాటు క్వార్టర్స్ నుంచి ఫైనల్ మ్యాచ్ దాకా ఉపయోగించిన బంతులను కూడా కొనుగోలు చేయవచ్చు. www.icc-shop.com వెబ్‌సైట్‌లో ఆయా వస్తువుల కోసం బిడ్‌ను వేయాల్సిందిగా క్రికెట్ అభిమానులకు ఐసీసీ సూచించింది.

Cricket fans given opportunity to bid for piece of ICC CWC 2015 history

వేలం పాటలో ఉన్న వస్తువులు:

* 49 మ్యాచ్‌లకు సంబంధించిన టాస్ నాణేలు

* మ్యాచ్ అధికారుల సంతకాలతో కూడిన అధికారిక స్కోరు కార్డు

* క్వార్టర్ ఫైనల్స్ నుంచి పైనల్ మ్యాచ్‌లో వినియోగించిన బంతి

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+