Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషబ్ పంత్ వన్డే ఆరంగేట్రం ఎప్పుడు?: కోహ్లీపై ఫ్యాన్స్ మండిపాటు

హైదరాబాద్: రిషబ్ పంత్... అండర్-19 వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకొచ్చిన యువకెరటం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో రాటుదేలిన ఈ 19 ఏళ్ల యువ క్రికెటర్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం కలగానే మిగిలిపోతుందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు.

వెస్టిండిస్‌తో ముగిసిన ఐదు వన్డే సిరిస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇటీవేలే ఓ కార్యక్రమంలో పాల్గొన్నా రాహుల్ ద్రవిడ్ భారత జట్టులో యువ ఆటగాళ్లుకు చోటు దక్కకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ద్రవిడ్ కోచింగ్‌లో రాటుదేలిన రిషబ్ పంత్

ద్రవిడ్ కోచింగ్‌లో రాటుదేలిన రిషబ్ పంత్

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పరాజయం తర్వాత భారత సీనియర్‌ ఆటగాళ్లు ధోనీ, యువరాజ్‌లు తమ భవిష్యత్తును ఇప్పుడే నిర్ణయించుకోవాలని ద్రవిడ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. నిజానికి దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అంతర్జాతీయ ఆరగేంట్రం త్వరలోనే ఉంటుందని అందరూ అనుకున్నారు.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన

అలాగే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే అందులో కేవలం ఒక మ్యాచ్‌లోనే తుది జట్టులో చోటు లభించింది. ఆ మ్యాచ్‌లో మూడు బంతులను ఎదుర్కొన్న పంత్ ఒక బౌండరీతో ఐదు పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

విండిస్ పర్యటనకు రోహిత్ శర్మ స్ధానంలో ఎంపిక

విండిస్ పర్యటనకు రోహిత్ శర్మ స్ధానంలో ఎంపిక

దీంతో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. అయినా ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే అవకాశం రాలేదు. అయితే వెస్టిండిస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి అతడి స్ధానంలో రిషబ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

కోహ్లీ తీరుపై అభిమానులు విమర్శలు

కోహ్లీ తీరుపై అభిమానులు విమర్శలు

వెస్టిండిస్‌తో వన్డే సిరిస్ కావడంతో కోహ్లీసేన ప్రయోగాలు చేస్తుందని, దీంతో పంత్ వన్డే అరంగేట్రం చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ సిరిస్‌ మొత్తం పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వన్డేల్లో అరంగేట్రం కోసం రిషబ్ పంత్ ఇంకెంత కాలం వేచి చూడాలో చెప్పాలంటూ కోహ్లీని అభిమానులు నిలదీస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+