For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ టెస్ట్: సెల్ఫీ కోసం వచ్చి కోహ్లీకి ముద్దివ్వబోయిన అభిమాని

Cricket Fan going to kiss team india captain virat kohli at uppal stadium.

హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైనం సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. బారికేడ్లను దాటి మరీ ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు.

కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేసిన అభిమాని

కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేసిన అభిమాని

పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన అభిమాని వెంటనే కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేశాడు. అంతేకాదు కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీంతో కోహ్లీ వారించడంతో సెల్ఫీ మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, పృథ్వీషా చేరుకునే సరికి వారితో కూడా సెల్పీ దిగాడు.

అభిమానిని దూరం జరిపిన కోహ్లీ

అభిమానిని దూరం జరిపిన కోహ్లీ

కోహ్లీ అతడిని దూరం జరుపుతుండగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వెంటనే ఉప్పల్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కడప జిల్లాకు చెందిన అహ్మద్‌ఖాన్(20)గా గుర్తించారు. కోహ్లీ మీద అభిమానంతోనే మైదానంలోకి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఇలాంటి ఘటనే రాజ్‌కోట్‌ మైదానంలో జరిగిన విషయం తెలిసిందే.

రాజ్‌కోట్ టెస్టులో కూడా ఇలాగే

రాజ్‌కోట్ టెస్టులో కూడా ఇలాగే

తొలిటెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఓ అభిమాని బారికేడ్లను తొలగించుకుని వచ్చి మరీ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. రెండో టెస్టులో మొదటిరోజు భోజన విరామ సమయానికి వెస్టిండిస్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా, భారత స్పిన్నర్లు అశ్విన్‌, కుల్దీప్‌లు ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చారు.

 లంచ్ విరామానికి వెస్టిండిస్ 86/3

లంచ్ విరామానికి వెస్టిండిస్ 86/3

ఓపెనర్లు బ్రాత్‌వెయిట్ 14, పావెల్ 22, షాయ్ హోప్ 36 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో విండీస్‌ 86 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హోప్‌, హెట్‌మెయిర్‌ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఉమేశ్‌ యాదవ్‌ హోప్‌(36) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేర్చాడు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 32 పరుగులు జోడించినప్పటికీ, ఆ తర్వాత మూడు వికెట్లు కోల్పోయింది.

Story first published: Friday, October 12, 2018, 13:54 [IST]
Other articles published on Oct 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+