IND vs WI: గిదేం సెలెక్షనయ్యా! కుల్దీప్, దీపక్ హుడాలను ఏ లేక్కన తీసుకున్నారు?

IND VS WI: ODI, T20I India's Squad Selection పై విమర్శలు | Oneindia Telugu

హైదరాబాద్: సౌతాఫ్రికా పర్యటనలో ఘోర వైఫల్యం, ముఖ్యంగా వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ టీమిండియాకు, సెలెక్టర్లకు ఓ గుణపాఠం. దాంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకన్నా బలమైన జట్టును ఎంపిక చేస్తారని, 2023 ప్రపంచకప్‌కు కావాల్సిన టీమ్‌పై ఫోకస్ పెడతారని అంతా భావించారు. కానీ, కరీబియన్లతో వన్డే, టీ20ల కోసం ప్రకటించిన టీమ్‌ను చూసి చాలా మంది మైండ్ బ్లాక్ అయింది.

చెత్తాటతో టీమ్‌కు దూరమైన కుల్దీప్ యాదవ్‌ను తిరిగి తీసుకోవడంతో పాటు దీపక్ హుడాకు వన్డేల్లో చాన్స్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సడన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్నోయ్‌ను టీ20 వన్డే టీమ్‌లోకి పిలవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. టీమ్ సుదీర్ఘ ప్రణాళికల్లో ఉన్న రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలను కాదని డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటని కుల్దీప్, దీపక్‌లకు అవకాశం ఇవ్వడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

6 నెలలుగా కుల్దీప్ ఆడలేదు..

6 నెలలుగా కుల్దీప్ ఆడలేదు..

జట్టులో మళ్లీ రిస్ట్- స్పిన్ ఆప్షన్ బౌలింగ్ కావాలనే కుల్దీప్ యాదవ్‌ను తిరిగి తీసుకున్నట్టు తెలుస్తోంది. చహల్‌కు తోడుగా కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారనొచ్చు. గతంలో కుల్చా జోడీ ఎన్నో విజయాలు అందించింది. కానీ గతేడాది భారత్‌కు ఆడిన నాలుగు వన్డేల్లో కుల్దీప్ కేవలం రెండే వికెట్లు తీసాడు. ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.

పైగా 2021 జూలై నుంచి అతను కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. ఈ నేపథ్యంలో ఫామ్ కాకుండా కేవలం పేరు చూసే కుల్దీప్‌ను టీమ్‌లోకి తీసుకున్నారా? లేదంటే కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సూచనలతో అవకాశం ఇచ్చారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షిద్దామనే ఆలోచనతో రవి బిష్ణోయ్ ఎంపికను సమర్థించవచ్చు. కానీ దీని వల్ల రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిల భవిష్యత్తుపై క్లారిటీ లేకుండా పోయింది.

దీపక్ హుడా ఎందుకు?

దీపక్ హుడా ఎందుకు?

ఏ రకంగా చూసినా వన్డే టీమ్‌కు స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా ఎంపిక సరైనదే అనిపించడం లేదు. ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్‌లో తను 16 యావరేజ్‌తో కేవలం 160 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లతో సరిపెట్టాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలోనూ హుడా గొప్పగా ఆడలేదు. కర్నాటకపై సెంచరీ చేయడమే తన బెస్ట్ పెర్ఫామెన్స్.

అదే టైమ్‌లో ఫుల్‌టైమ్ బౌలింగ్ చేసింది కూడా లేదు. అలాంటి ప్లేయర్‌తో వన్డేల్లో ఏం చేయిస్తారో అర్థం కాని ప్రశ్న. ఇక, మొన్నటిదాకా శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఆల్‌రౌండర్స్ రోల్‌కు రెడీగా లేరన్న సెలెక్టర్లు సౌతాఫ్రికా సిరీస్‌లో వాళ్ల ఆట చూశాక యూటర్న్ తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో వన్డేల్లో ఇప్పుడు ఇద్దరూ పేస్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు.

కానీ విజయ్ హజారే ట్రోఫీలో మిడిలార్డర్‌లో సత్తా చాటిన హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. హిమాచల్‌ను విజేతగా నిలబెట్టిన రిషిని తీసుకోవాల్సిందని విశ్లేషకు అభిప్రాయపడుతున్నారు.

వన్డే సిరీస్‌కే గైక్వాడ్..

వన్డే సిరీస్‌కే గైక్వాడ్..

యువ సంచలనం రుతురాజ్ గైక్వాడ్‌ను టీ20లకు కాదని కేవలం వన్డే సిరీస్‌కే పరిమితం చేయడం కూడా సరైన నిర్ణయం కాదనిపిస్తోంది. లాస్ట్ ఐపీఎల్‌లో తను టాప్ స్కోరర్. పైగా, సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ తనకు ఒక్క చాన్స్ కూడా రాలేదు. విజయ్ హజారే ట్రోఫీలో సైతం నాలుగు భారీ సెంచరీలతో టాప్ స్కోరర్‌గా నిలిచిన గైక్వాడ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ప్లేయర్‌కు వైట్‌బాల్ ఫార్మాట్‌లో వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తే సక్సెస్ అవుతారు.

వెస్టిండీస్‌తో భారత్ జట్టు..

వెస్టిండీస్‌తో భారత్ జట్టు..

వన్డే జట్టు: రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, శిఖ‌ర్ ధవన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్ యాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్, దీపక్‌ హూడా, రిష‌బ్‌ పంత్‌, చాహర్‌, శార్దూల్ ఠూకూర్, చాహల్‌, కుల్దీప్ యాద‌వ్‌, వాషింగ్ల‌న్‌ సుందర్‌, ర‌వి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌, అవేశ్‌ఖాన్‌.

రోహిత్ శ‌ర్మ‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌కెప్టెన్‌), ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, సూర్యకుమార్ యాద‌వ్, రిష‌బ్‌ పంత్‌, వెంకటేశ్అయ్య‌ర్, చాహర్‌, శార్దూల్ ఠాకూర్, ర‌వి బిష్ణోయ్‌, అక్షర్ ప‌టేల్, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్ కుమార్‌, అవేశ్‌, హర్షల్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, January 28, 2022, 9:28 [IST]
Other articles published on Jan 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X