జూన్‌లో టూర్ ఎఫెక్ట్: బంగ్లాతో వన్డేలు అనుమానమే
ఢాకా: వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో భారత్ ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వన్డేలకు కూడా వర్షం ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. జూన్ 8వ తేదీ నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కానీ, వర్షం దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా సమాచారం మరకు.. బంగ్లాదేశ్‌లో ఆదివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీగా వర్షం కురిసింది. మరో మూడు రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముంది.
బంగ్లాదేశ్‌తో 18వ తేదీన తొలి వన్డే మ్యాచ్ ఉంది. 24వ తేదీన చివరి వన్డే ఉంది. ఇవన్నీ డే అండ్ నైట్ మ్యాచులు. మీర్పుర్‌లోని షేర్ బంగ్లా స్టేడియంలో మ్యాచులు జరగవలసి ఉంది.

స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఢాకాలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌లో ఇది భారీగా వర్షాలు కురిసే సమయం.
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో జూన్ నెలలో మొదటిసారి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అందరు ఊహించినట్లే ఫలితం తేలలేదు. బంగ్లాదేశ్‌తో జూన్ పర్యటన షెడ్యూల్ ఖరారైనప్పుడే.. వర్షాలు బాగా కురిసే జూన్ నెలలో పర్యటన పైన అనుమానాలు రేకెత్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications