ఐపీఎల్లో ఆడిస్తానంటూ 13 ఏళ్ల కుర్రాడిని లైంగిక వేధింపులకి గురి చేసిన కోచ్

హైదరాబాద్: ఐపీఎల్‌లో ఆడే ఛాన్సిస్తానంటూ యువ క్రికెటర్‌పై కోచ్ లైంగిక వేధింపులకి పాల్పడిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదమూడేళ్ల కుర్రాడ్ని ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం ఇస్తానంటూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పర్యావసానంగా జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
ఎలహంకా పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల క్రికెట్ కోచ్ నజీర్. ఇతను సొంతంగా జలహల్లి ప్రాంతంలో క్రికెట్ అకాడమీ నడుపుతున్నాడు. తన వద్దకు శిక్షణ కోసం వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని అభ్యంతరకర రీతిలో తాకుతూ వేధింపులకు గురి చేశాడు.
గత శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బాలుడి క్రికెట్ ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత కోచ్ అతడ్ని తన వ్యానులోనే ఇంటిదగ్గర దిగబెడతానని ఎక్కించుకున్నాడు. ప్రయాణంలో బాలుడ్ని అభ్యంతరకరరీతిలో తాకాడు. తనకి సహకరిస్తే ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ కల్పిస్తానని అతనిని వేదించినట్లు సమాచారం.
భయాందోళనకు గురైన బాధితుడు ఆలస్యంగా విషయాన్ని ఇంట్లో చెప్పడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు పూర్తి వివరాలకై దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications