Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బస్సు బ్రేక్ డౌన్: లంకలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న కివీస్ క్రికెటర్లు

Cricket: Black Caps tour bus breaks down in Sri Lanka

హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెటర్లు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ సమం అయింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా, రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది.

రు జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి మూడు టీ20ల సిరిస్ ఆరంభం కానుంది. టెస్టు సిరిస్ అనంతరం కాస్త విరామం లభించడంతో న్యూజిలాండ్ క్రికెటర్లు సమీపంలోని హిల్ స్టేషన్ అయిన కేండీని సందర్శించేందుకు వెళ్లింది. అయితే, వారు ప్రయాణిస్తున్న బస్సు మార్గమధ్యంలోనే ఆగిపోయింది.

బస్సు బ్రేక్ డౌన్ కావడంతో మొరాయించింది. దీంతో క్రికెటర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అంబులెన్స్, ఆర్మీ జీపులు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా హోటల్‌కు చేర్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

Story first published: Friday, August 30, 2019, 20:13 [IST]
Other articles published on Aug 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+