న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బౌర్న్‌ వీక్షకులను హెచ్చరించిన క్రికెట్ ఆస్ట్రేలియా

Cricket Australia warns MCG fans against racist chants: Report

మెల్‌బౌర్న్‌: క్రికెట్ ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసింది. మెల్‌బౌర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియాను జాతి వివక్ష చూపించేలా వ్యాఖ్యలు చేస్తుండటంతో వారిని మందలింపుగా హెచ్చరించింది. మూడో టెస్టు జరుగుతోన్న నేపథ్యంలో వాడివేడిగా ఆరోపణలు వినిపించాయట. ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెట్ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. మూడో టెస్టులో భాగంగా తొలి రెండ్రోజులు స్టేడియానికి వచ్చిన అభిమానులు భారత క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యాలు చేశారట. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా 1-1తో సమంగా సాగుతున్న ఇరు జట్లు మెల్‌బౌర్న్‌లో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ జరిగిన వివాదం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా దగ్గర వీడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయట.

హాహాకారాలు చేస్తున్న వీడియోను చూపించి..

హాహాకారాలు చేస్తున్న వీడియోను చూపించి..

భారత క్రికెటర్లను మీ వీసాలు చూపించండి అంటూ హాహాకారాలు చేస్తున్న వీడియోను చూపించి స్టేడియం మేనేజ్‌మెంట్ పోలీసులతో హెచ్చరికలు పంపిందట. మర్యాదగా నడుచుకోవాలని లేదంటూ తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిందట. బాక్సింగ్ డే టెస్టు జరుగుతోన్న మెల్‌బౌర్న్‌ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారేం కాదు. 2005లోనూ బాక్సింగ్ డే టెస్టు జరుగుతున్న సమయంలో ఇలానే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఆండ్రి నెల్‌పై వ్యాఖ్యలు చేశారట.

వారిలో అనుచిత ప్రవర్తనలు గమనించాం

వారిలో అనుచిత ప్రవర్తనలు గమనించాం

'విక్టోరియా పోలీస్, స్టేడియం భద్రతా విభాగాలు స్టేడియంలోని వీక్షకుల ప్రవర్తనా శైలి గురించి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిలో అనుచిత ప్రవర్తనలు గమనించాం. క్రికెటర్లు వచ్చే దారి గుండా కూర్చొని ఉన్న వారు టీమిండియాను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు' అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

స్వదేశంలోనే చేదు అనుభవం

స్వదేశంలోనే చేదు అనుభవం

తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 చేసిన పరుగులపై కూడా అసభ్యంగా మాట్లాడారట. దీంతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్‌కు స్వదేశంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ను ప్రేక్షకులు రెండుసార్లు హేళన చేశారు. స్థానిక ప్లేయర్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌ స్థానంలో మార్ష్‌ను మూడో టెస్టుకు ఎంపిక చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మిచెల్‌ బౌలింగ్‌కు దిగుతున్నట్టు స్టేడియంలో ప్రకటించిన సందర్భంలో ఒక్కసారిగా ప్రేక్షకులు అరుస్తూ ఎగతాళిగా ప్రవర్తించారు.

ఎంసీజీ ప్రేక్షకుల తీరు దారుణమని..

ఎంసీజీ ప్రేక్షకుల తీరు దారుణమని..

ఎంసీజీ ప్రేక్షకుల తీరు దారుణమని.. తమను ఎంతో బాధించిందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ అన్నాడు. మ్యాచ్‌కు ముందు ఓ ఫేస్‌బుక్‌ పేజ్‌లో మార్ష్‌ను హేళన చేయాలని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. అయితే, మిచెల్‌ ప్రదర్శనపై ఇవేమీ ప్రభావం చూపలేదని హెడ్‌ చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకావని ఆశిస్తున్నానన్నాడు.

Story first published: Friday, December 28, 2018, 17:00 [IST]
Other articles published on Dec 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X