For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా మెలిక!!

Cricket Australia wants to host 2021 T20 World Cup, ICC says no decision taken

సిడ్నీ: ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ అయి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) 2022కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా పొట్టి ప్రపంచకప్‌ నిర్వహణ అంశంపై ఐసీసీ గురువారం చర్చించనుంది.

కరోనా వైరస్ కారణంగా సెప్టెంబరు వరకు ఆస్ట్రేలియా‌లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అక్టోబరు 18 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కావాలి. ఇంత తక్కువ వ్యవధిలో టోర్నీ నిర్వహించడం అసాధ్యం. 16 జట్ల ఆటగాళ్లను వైరస్ బారిన పడకుండా జాగ్రత్తపడడం, ప్రయాణ ఇబ్బందులు, హోటల్ లాంటివి అన్ని చూసుకోవడం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు తలకు మించిన భారమే. ఇక ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌‌ని నిర్వహిస్తే.. ఆర్థికంగానూ చాలా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఐసీసీ, సీఏ టోర్నీ వాయిదా వైపే మొగ్గుచూపాయి.

అయితే తాజాగా టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై సీఏ ఓ మెలిక పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఏడాదికి బదులు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కుల్ని తమకి ఇవ్వాలని ఐసీసీని సీఏ ఛైర్మన్ ఎర్లీ ఎడ్డింగ్స్ లేఖ ద్వారా కోరారట. నిజానికి 2021 టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు భారత్ వద్ద ఉన్నాయి. బీసీసీఐ ఆ హక్కులను వదుకోలేదు. మరోవైపు ఐపీఎల్ 2020 సీజన్‌ కోసమే సీఏ, ఐసీసీ మెగా టోర్నీ‌ వాయిదాకి ఒప్పుకున్నట్లు ఇప్పటికే పీసీబీ ఆరోపిస్తోంది. దీంతో ఐసీసీకి ఎం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.

భారత్‌లో జరిగే ఐపీఎల్ కోసం టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయాలనుకోవడాన్ని తాము సమర్థించబోమని పీసీబీ అధికారి ఒకరు స్పష్టం చేసారు. 'టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ఇది మే నెలనే కాబట్టి ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలి. రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. క్రికెట్‌ క్యాలెండర్‌ ప్రకారం పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇంగ్లండ్‌లో సిరీస్‌ ఆడే అవకాశం ఉంది' అని పీసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు.

'ఐపీఎల్‌ అనేది ఓ దేశీయ టోర్నీ. దానిని బీసీసీఐ నిర్వహిస్తోంది కానీ ఐసీసీ కాదు. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఆ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయిస్తామంటే మేం వ్యతిరేకిస్తాం. ఐసీసీ ఈవెంట్స్‌, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాం. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు మేం మద్దతివ్వం. ఐపీఎల్ కోసం టీ20 ప్రపంచకప్ రీ షెడ్యూల్ చేయడానికి ఒప్పుకోం' అంటూ పీసీబీ అధికారి స్పష్టం చేసారు.

Story first published: Thursday, May 28, 2020, 13:40 [IST]
Other articles published on May 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+