Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వినూత్న ఆలోచన.. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు

Cricket Australia to introduce transgender players in Cricket

సిడ్నీ: ట్రాన్స్‌జెండర్లు ఆటలో అత్యున్నత స్థాయిలో పాల్గొనగలరని నిర్ధారించడానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ వినూత్న ఆలోచనతో నెటిజన్ల ముందుకువచ్చింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్రాన్స్‌జెండర్లకు కూడా క్రికెట్‌లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ఉన్నత మహిళా జట్లకు అర్హత సాధించడానికి శరీరంలోని టెస్టోస్టిరాన్ మోతాదు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల మేరకు ఉండాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌ టాగ్‌ను జతచేసింది. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు, లింగభేదం లేని ఆట అనే నినాదాలతో ఈ కార్యక్రమానికి సీఏ స్వీకారం చుట్టింది.

రాష్ట్ర మరియు జాతీయ మహిళా జట్ల కోసం ఆడాలనుకునే ట్రాన్స్‌జెండర్లకు టెస్టోస్టెరాన్ పరిమితిని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్దేశించింది. ట్రాన్స్‌జెండర్లు ఉన్నత మహిళా జట్లకు అర్హత సాధించడానికి 12 నెలల్లో లీటరుకు 10 నానోమోల్స్ కంటే తక్కువ టెస్టోస్టిరాన్ మోతాదును చూపించాలి. మరోవైపు రోజూ తమ జీవితాలను ఎలా గడుపుతున్నారో కూడా ట్రాన్స్‌జెండర్లు నిరూపించగలగాలి.

ఈ వినూత్న నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరింది. ఈ విషయంపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు సీఏ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Story first published: Friday, August 9, 2019, 11:28 [IST]
Other articles published on Aug 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+