ఐసీసీ కంటే ముందే బౌండరీ రూల్‌ను మార్చేసిన 'సీఏ'.. బీబీఎల్‌తో అమలు

సిడ్నీ: వన్డే ప్రపంచకప్‌లో బౌండరీ రూల్ పెను దుమారమే రేపింది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లండ్‌ను విజేతగా నిర్ణయించారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనపై క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెటర్లు ఐసీసీ తీరును తప్పుపట్టారు.

ఐసీసీ కంటే ముందే:
బౌండరీల లెక్కింపుతో కాకుండా మ్యాచ్ ఫలితం వచ్చే వరకు మరిన్ని సూపర్ ఓవర్లు ఆడించాలని చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఐసీసీకి సూచన చేశారు. తీవ్ర విమర్శలు, సూచనల నేపథ్యంలో ఐసీసీ ఈ రూల్‌పై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 'బౌండరీ కౌంట్ రూల్ స్థానంలో మరిన్ని ఓవర్ల మ్యాచ్ (సూపర్ ఓవర్) జరపాలనే యోచనలో ఐసీసీ ఉంది. అయితే ఐసీసీ కంటే ముందే బౌండరీ రూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మార్చేసింది. అంతేకాదు ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) తాజా సీజన్ నుంచి అమలు చేయడానికి సీఏ నిర్ణయం తీసుకుంది.

బీబీఎల్‌తో కొత్త రూల్ అమలు:
2019-20 సీజన్‌లో జరుగనున్న బీబీఎల్‌లో మ్యాచ్ టైగా ముగిస్తే.. బౌండరీ కౌంట్ కాకుండా మరిన్ని సూపర్ ఓవర్లు వేయించనుంది సీఏ. బీబీఎల్‌లో ఒక వేళ ఫైనల్ మ్యాచ్ టైగా ముగిస్తే.. ముందుగా సూపర్ ఓవర్‌ను వేయిస్తుంది. అది కూడా టైఅయితే మరో సూపర్ వేయిస్తుంది. ఇలా ఫలితం వచ్చే వరకు మరికొన్ని సూపర్ ఓవర్లు వేయించి విజేతను నిర్ణయిస్తారు. ఈ కొత్త నిబంధనను పురుషుల బీబీఎల్‌తో పాటు మహిళల బీబీఎల్‌లో కూడా కొనసాగించనున్నట్లు ఆ లీగ్ చీఫ్ అలిస్టర్ డాబ్సన్ తెలిపారు.

విజయవంతం అవుతుందనే ఆశిస్తున్నాం:
అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ... 'ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత బౌండరీ కౌంట్ రూల్‌పై పెద్ద విమర్శలు వచ్చాయి. చాలా మంది మండిపడ్డారు. కొన్ని సూచనలు కూడా చేశారు. దాంతో ఫైనల్ మ్యాచ్ టై అయితే.. పలు సూపర్ ఓవర్ల విధానాన్ని తీసుకు రావాలని భావిస్తున్నాం. ఇది విజయవంతం అవుతుందనే ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు.

సూపర్ ఓవర్ కూడా టై:
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications