వార్నర్ కాళ్ల బేరానికొచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడించడానికి భారీ మొత్తం ఆఫర్..

క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే దేశీయ టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ (BBL). ఈ బిగ్‌బాష్ లీగ్లో డేవిడ్ వార్నర్‌ను ఆడించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా కాళ్లబేరానికి వచ్చింది. బిగ్ బాష్ లీగ్లో గనుక ఆడితే అతనికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పేందుకు రెడీ అయింది. రిపోర్ట్స్ ప్రకారం.. బీబీఎల్ బ్రాడ్ కాస్టర్ అయిన ఛానెల్ 7తో క్రికెట్ ఆస్ట్రేలియాకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. బిగ్ బాష్ లీగ్ టోర్నీలో క్వాలిటీ లేదని, తాము నష్టపోతున్నామని ఛానెల్ 7 క్రికెట్ ఆస్ట్రేలియాపై దావా వేసింది. ఇక ఎలాగైన బిగ్ బాష్ లీగ్‌ను నాణ్యమైన, మంచి వ్యూయర్ షిప్ టోర్నీగా నిలపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆసీస్ స్టార్ ప్లేయర్లకు డబ్బుతో వల వేయడానికి సిద్ధమైంది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై విధించిన కెప్టెన్సీ బ్యాన్ ఇంకా తొలగించకుండానే అతనితో బేరసారాలకు దిగి కమర్షియల్ కోణాన్ని చూపించుకుంది.

పెద్ద దెబ్బే
వార్నర్ ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్ బాల్ క్రికెటర్లలో ఒకడు. అతను వచ్చే ఏడాది యూఏఈలో జరగబోయే టీ20లీగ్‌లో ఆడాలని దాదాపు అడుగులు వేస్తున్నాడు. ఇకపోతే ఐపీఎల్ ఫ్రాంచైజీలు యూఏఈలో టీంలను కొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంచైజీలు వార్నర్‌ను యూఏఈలో ఆడించేందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అతను యూఏఈ లీగ్‌లో గనుక ఆడితే బిగ్ బాష్ లీగ్‌కు పెద్ద దెబ్బే.

పెద్ద ప్రాబ్లమే
ఆస్ట్రేలియాలో వార్నర్‌కు ఉన్న క్రేజ్ పరంగా.. బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లకు బదులు యూఏఈ లీగ్ మ్యాచ్‌లనే చాలా మంది ఆసీస్ ప్రేక్షకులు చూసే వీలుంది. తద్వారా బీబీఎల్ వ్యూయర్ షిప్ ఘోరంగా పడిపోవడం ఖాయం. ఇదే జరిగితే సీఏకి పెద్ద దెబ్బ. ఛానల్ 7తో ఒప్పందం మేరకు ఓ రేంజ్ వ్యూయర్ షిప్ తమ లీగ్‌కు ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా కోట్ చేసింది. కానీ అందులో సగం కూడా వ్యూయర్ షిప్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇదే జరిగితే ఛానెల్ 7 కేసు నెగ్గడమే కాకుండా భారీ మొత్తంలో క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి పరిహారం పొందాల్సి వస్తుంది. ఇది సీఏకు పెద్ద ప్రాబ్లమే..

పెద్ద మొత్తమే
వార్నర్‌ను బిగ్ బాష్ లీగ్‌లో ఆడించడానికి ఏకంగా $500,000 (5లక్షల డాలర్లు) కంటే ఎక్కువగా మొత్తాన్ని సీఏ వార్నర్‌కు అందించడానికి సిద్ధమైంది. బిగ్ బాష్ లీగ్ స్థాయిని మెరుగుపరచడం, మరింత మంది వీక్షకులను ఆకర్షించాలనే ఆశతో సీఏ ఈ నిర్ణయానికి పూనుకుంది. వార్నర్‌తో పాటు స్టార్ ఆల్ రౌండర్లు, BBL రికార్డ్ హోల్డర్‌లు అయిన మార్కస్ స్టోయినిస్ గ్లెన్ మాక్స్‌వెల్‌లకు కూడా మెగా డీల్‌లను ఆఫర్ చేయబోతుంది. ఇప్పటికే డేవిడ్ వార్నర్ యూఏఈ లీగ్‌లో పాల్గొనడానికి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి పర్మిషన్ కోరాడు. ఆ పర్మిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. వార్నర్ మేనేజర్లు.. సీఏ అధికారులు చర్చల్లో పాల్గొని ఓ ఒప్పందానికి త్వరలోనే రానున్నారు. వార్నర్ మరి సీఏ ఆఫర్‌కు ఒప్పుకొని బిగ్ బాష్ లీగ్ ఆడతాడో.. లేక తనపై కెప్టెన్సీ బ్యాన్ ఇంకా తొలగించకపోవడాన్ని ప్రతీకారంగా తీసుకుని యూఏఈ లీగ్‌కే జై కొడతాడో త్వరలోనే తేలాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications