Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త బాధ్యత: ఆసీస్ టీ20 అసిస్టెంట్ కోచ్‌గా జాసన్ గిలెస్పీ

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగే మూడు టీ20 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంకతో జరగనున్న సిరిస్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికైన ఇటీవలే జస్టిస్ లాంగర్‌‌తో కలిసి అతడు సేవలందిస్తాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఇదే సమయంలో ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించే ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు హెడ్ కోచ్ డారెన్‌ లెమాన్‌, సహాయకుడుగా డేవిడ్‌ సేకర్‌ ఉంటారని తెలిపింది. బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రయికర్స్ కోచ్‌‌గా వ్వహరిస్తున్న గిలెస్పీ గతంలో ఐదేళ్ల పాటు ఇంగ్లిష్‌ కౌంటీ యార్క్‌షైర్‌కు కోచ్‌గా వ్యవహరించాడు.

Cricket Australia name Jason Gillespie as T20 assistant coach

ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కావడంపై గిలెప్సీ హర్హం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా జట్టుతో కలిసి పనిచేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ అవకాశం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాని గిలెస్పీ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు తరుపున 71 టెస్టు మ్యాచ్‌లాడిన జాసన్ గిలెస్పీ 259 వికెట్లు తీసుకోగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడు టీ20ల్లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 17వ తేదీన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుండగా రెండో టీ20 ఫిబ్రవరి 19న గ్రీలాంగ్, మూడొది అడిలైడ్ ఓవల్‌లో ఫిబ్రవరి 22వ తేదీన జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+