ICC T20 World Cup 2024 : వరల్డ్ కప్‌లో అతన్ని కెప్టెన్ చేయడానికి.. రూల్స్ మార్చిన క్రికెట్ బోర్డు!

ఒకరిద్దరు ఆటగాళ్ల కోసం మొత్తం రూల్స్ మార్చేయడం దాదాపుగా ఎక్కడా జరగదు. కానీ ఒక్కోసారి ఆ మార్పుల వల్ల ఉపయోగం ఉంటుందని అనుకుంటే అవి తప్పవు కదా. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) పరిస్థితి అలాగే ఉంది. ఈ క్రమంలోనే ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జట్టు సారధిగా చేయాలని సీఏ భావిస్తోంది. కానీ అతను కెప్టెన్ అవ్వకుండా జీవితకాల బ్యాన్ ఉంది. దీంతో అతని కోసం ప్రత్యేకంగా ఈ బ్యాన్‌పై అప్పీల్ చేసుకునేలా కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు చేసిందా బోర్డు.

బాల్ ట్యాంపరిగ్ వివాదం..
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార్నర్‌తోపాటు మరో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయం బయట పడటంతో వారిద్దరినీ కొంతకాలంపాటు జాతీయ జట్టులో ఆడకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికీ కెప్టెన్సీ బాధ్యతల విషయంలో మాత్రం జీవితకాలం బ్యాన్ విధించారు. దీంతో ఈ ఇద్దరూ ఆస్ట్రేలియా కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం అసాధ్యంగా మారింది.

ఆరోన్ ఫించ్ రిటైర్‌మెంట్
ఆస్ట్రేలియా జట్టు వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్.. కొన్నిరోజుల క్రితమే వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతని తర్వాత ఎవర్ని కెప్టెన్ చేయాలనే ప్రశ్న తలెత్తింది. అభిమానులు, మాజీలు అందరూ వార్నర్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. కానీ నాయకత్వ పాత్రల్లో జీవితకాల బ్యాన్ ఎదుర్కొంటున్న అతనికి ఆ అవకాశం లేదు. ఈ క్రమంలోనే తమపై ఇలా జీవితకాల బ్యాన్ ఉంటే దాన్ని ముగ్గురు సభ్యుల ప్యానెల్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది.

వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో..
ప్రస్తుతం చెత్త ఫామ్‌లో ఉన్న ఆరోన్ ఫించ్.. 2024లో జరిగే టీ20 వరల్డ్ కప్ నాటికి పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్‌బై చెప్పేస్తే.. వార్నర్‌కే ఆ టోర్నీలో జట్టు పగ్గాలు అందించే అవకాశం ఉంది. ఇటీవలే వార్నర్ కూడా తను మరికొంత కాలం వైట్ బాల్ క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. ముందుగా టెస్టులకే వీడ్కోలు పలుకుతానని చెప్పాడు.
ఇప్పుడు వార్నర్ గనుక ప్యానెల్‌కు తన కేసును అప్పీల్ చేసుకుంటే.. బ్యాన్ తర్వాత సదరు ఆటగాడిలో మార్పు వచ్చిందా? ఈ బ్యాన్ తొలగించడానికి అతను అర్హుడేనా? తదితర అంశాలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వరల్డ్ కప్‌లో ఆసీస్ జట్టుకు వార్నరే సారధ్యం వహించే అవకాశం కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications